బాలీవుడ్ మూవీ స్ట్రీ 2 ఇండస్ట్రీ హిట్ రికార్డు కొట్టేసింది.గత నెలలో విడుదలైన ఈసినిమా ఇప్పటికీ సెన్సేషనల్ రన్ ను కొనసాగిస్తూ సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది.దాంతో అత్యధిక వసూళ్లను సాధించిన హిందీ సినిమాగా రికార్డు సృష్టించింది.నిన్నటి తో స్త్రీ 2, 586 కోట్ల వసూళ్లను సాధించింది.ఇంతకుముందు షారుఖ్ ఖాన్, జవాన్ 584కోట్ల నెట్ తో మొదటి స్థానం లో ఉండేది. ఇప్పుడు స్త్రీ 2 ఆ రికార్డును బ్రేక్ చేసి మొదటి స్థానం లో నిలిచింది. ఈ స్త్రీ 2 రికార్డు ను బ్రేక్ చేసే అవకాశం నెక్స్ట్ పుష్ప 2కే వుంది.ఫస్ట్ పార్ట్ అక్కడ 100కోట్లకు పైగా రాబట్టి బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.పుష్ప 2 కు తెలుగులో ఎంత హైప్ వుందో నార్త్ లోనూ అంతే వుంది.మరి పుష్ప 2 ఈ రికార్డు ను బ్రేక్ చేస్తుందో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రపంచ వ్యాప్తంగా స్త్రీ 2,800కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.దాంతో ఈఏడాది లో కల్కి 2898 ఏడి తరువాత సెకండ్ హైయెస్ట్ ఇండియన్ గ్రాసర్ మూవీగా రికార్డు సృష్టించింది. అయితే ఫుల్ రన్ లో 1000కోట్ల మార్క్ చేరుకోవడం సాధ్యం కాకపోవచ్చు.
ప్రస్తుతం బాలీవుడ్ లో పెద్దగా పోటీ లేకపోవడం కూడా స్త్రీ 2కు కలిసొచ్చింది.ఇక 48రోజుల తరువాతే ఈసినిమా ఓటిటిలోకి రానుంది.అన్ని కుదిరితే వచ్చే నెల చివర్లో స్ట్రీమింగ్ లోకి వచ్చే ఛాన్స్ వుంది. బ్లాక్ బాస్టర్ స్త్రీకి సీక్వెల్ గా అమర్ కౌశిక్ తెరకెక్కించిన ఈసినిమాలో శ్రద్దా కపూర్, రాజ్ కుమార్ రావు,పంకజ్ త్రిపాఠి,అభిషేక్ బెనర్జీ కీలక పాత్రల్లో నటించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























