బాలీవుడ్ లేటెస్ట్ సూపర్ హిట్ ‘స్త్రీ 2’ చరిత్ర తిరగరాస్తోంది. 2018 లో వచ్చిన ‘స్త్రీ’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్, ప్రముఖ నటుడు రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రలలో నటించగా.. పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపర్షక్తి ఖురాణాలు కీలక పాత్రల్లో నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మద్దోక్ ఫిల్మ్స్ మరియు జియో స్టూడియోస్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ రన్ కొనసాగిస్తుంది. మచ్ అవైటెడ్ మూవీగా వచ్చిన స్త్రీ 2 ఈఏడాది బాలీవుడ్‌లో అత్యధిక ఓపెనింగ్స్‌ను రాబట్టిన సినిమాగా నిలిచింది.
ఫస్ట్ పార్ట్ స్త్రీ మొదటి వారంలో రూ.60 కోట్ల వసూళ్లను రాబట్టగా.. ఇప్పుడు స్త్రీ 2 ఒక్క రోజులోనే ఆ కలెక్షన్లను క్రాస్ చేయడం విశేషం. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ రూ.573 కోట్లకు పైగా వసూలు చేసి 600 కోట్ల దిశగా దూసుకుపోతుంది. ఇదే జోరును కొనసాగిస్తే, వచ్చే వారాంతం నాటికి 600 కోట్ల క్లబ్‌లో చేరి చరిత్ర సృష్టించడం పక్కా.
అయితే ఇదిలావుంటే, తాజాగా ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ సృష్టించింది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘యానిమల్’ రికార్డ్‌ను స్త్రీ 2 బీట్ చేసింది. బాలీవుడ్‌లో యానిమల్ మూవీ టోటల్ రన్‌లో రూ.553 కోట్లు కలెక్ట్ చేయగా.. స్త్రీ 2 ఇప్పటికే 20 కోట్లు ఎక్కువగా రూ.573 కోట్లు అందుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. కాగా షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ రూ.640 కోట్లతో తొలిస్థానంలో ఉంది.
ఇక ఈ చిత్రం విడుదలై నెల దాటినప్పటికీ ఇంకా చాలాచోట్ల హౌస్ ఫుల్ గా రన్ అవుతుండటం గమనార్హం. దీంతో రాబోయే రోజుల్లో స్త్రీ 2 ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హార్రర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. అయితే స్త్రీ 2 హిట్ కావడంతో స్త్రీ 3 కూడా రూపొందించే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























