విక్రమ్ ను బీట్ చేయనున్న ది గోట్

The goat will soon beat Vikram lifetime collections

దళపతి విజయ్ నటించిన ది గోట్ తమిళనాడులో సెన్సేషనల్ రన్ ను కొనసాగిస్తోంది.రెండవ వారాంతంలో దాదాపు అక్కడ 40కోట్ల గ్రాస్ ను రాబట్టుకుంది.దాంతో మొత్తం 11రోజుల్లో తమిళనాడులో 180కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకొని టాప్ 2 గ్రాసర్ గా నిలిచింది.ఫుల్ రన్ లో ఆల్ టైం గ్రాసర్ గా రికార్డు సృష్టించనుంది.విజయ్ కి ఇది వరుసగా రెండో 200 కోట్ల సినిమా కానుంది.ఇంతకుముందు లియో 220కోట్లకు పైగా రాబట్టింది.ది గోట్ నిన్నటితో అక్కడ బ్రేక్ ఈవెన్ ను కూడా కంప్లీట్ చేయడంతో ఫుల్ రన్ లో భారీ లాభాలను తీసుకరానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఓవరాల్ గా చూస్తే ది గోట్ 11 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 400కోట్ల మార్క్ ను చేరుకుంది.ఈ వారంలో విక్రమ్ లైఫ్ టైం కలెక్షన్స్(425కోట్లు)ను బీట్ చేయనుంది.అలాగే థియేట్రికల్ రన్ ముగిసేసరికి అత్యధిక వసూళ్లను రాబట్టిన తమిళ సినిమాల జాబితాలో ది గోట్ 5వస్థానంలో ఉండనుంది.ఇక ఈసినిమా ఓవర్సీస్ అలాగే కర్ణాటక లో బ్రేక్ ఈవెన్ కాగా నార్త్ ఇండియా 20కోట్ల కు పైగా రాబట్టింది.వెంకట్ ప్రభు ఈసినిమాను డైరెక్ట్ చేయగా యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.

ఇదిలావుంటే విజయ్ చివరి సినిమా దళపతి 69(వర్కింగ్ టైటిల్) అనౌన్స్ మెంట్ కూడా వచ్చిన విషయం తెలిసిందే.హెచ్ వినోత్ ఈసినిమాను తెరకెక్కించనుండగా అనిరుధ్ సంగీతం అందించనున్నాడు.భారీ బడ్జెట్ తో కేవీఎన్ ప్రొడక్షన్ నిర్మించనుంది.త్వరలోనే ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లనుండగా వచ్చే ఏడాది అక్టోబర్ లో థియేటర్లలోకి రానుంది.మరి లాస్ట్ మూవీ గా వస్తున్న ఈసినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.