దళపతి విజయ్ నటించనున్న 69వ సినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.ఈసినిమాను ఖాకి ఫేమ్ హెచ్ వినోత్ డైరెక్ట్ చేయనుండగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నాడు.ఈసినిమా ఎప్పుడు రానుందో కూడా చెప్పేశారు.వచ్చే ఏడాది అక్టోబర్ లో రిలీజ్ చేస్తామని పోస్టర్ లో మెన్షన్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
విజయ్ పెద్దగా బ్రేక్ లు తీసుకోడు కాబట్టి అనుకున్న ప్రకారమే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా వుంది.త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కానుంది.కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో ఈసినిమాను నిర్మించనుంది.తమిళంలో ఈ సంస్థకు ఇదే మొదటి సినిమా.ప్రస్తుతం కేవీఎన్ ప్రొడక్షన్స్,కెజియఫ్ ఫేమ్ యష్ తో టాక్సిక్ అనే సినిమాను నిర్మిస్తుంది.
ఇక 69వ సినిమా చేసి విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నాడు.ఇప్పటికే తను పొలిటికల్ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే.2026 తమిళనాడు ఎలక్షన్స్ టార్గెట్ గా విజయ్ పార్టీ బరిలోకి దిగనుంది.దాంతో ఈ 69వ సినిమా చేసి విజయ్ పొలిటికల్ గా బిజీ కానున్నాడు.ఇక విజయ్ చివరి సినిమాను ఫ్యాన్స్ కు గుర్తిండిపోయేలా తెరక్కించాలని హెచ్ వినోత్ పట్టుదలతో వున్నాడు.
ఇదిలావుంటే రీసెంట్ గా విజయ్ ది గోట్ తో ప్రేక్షకులముందుకు రాగ ప్రస్తుతం ఈసినిమా తమిళనాడులో దుమ్మురేపుతోంది.టాక్ తో సంబంధం లేకుండా అక్కడ 150 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.ఓవరాల్ గా నిన్నటి వరకు 400కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకుంది.వెంకట్ ప్రభు ఈసినిమాను డైరెక్ట్ చేయగా ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: