తెలుగు రాష్ట్రాలలో ఇటీవల కురిసిన ఎడతెరిపిలేని వర్షాలకు భారీ వరదలు సంభవించిన విషయం తెలిసిందే. దీంతో చాలా ప్రాంతాలు జలమయం అవడంతో ఆయా ప్రాంతాల ప్రజలు చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సహాయక చర్యలు ముమ్మురంగా కొనసాగిస్తున్నాయి. బాధితులను పునరావాసాలకు తరలించడం, ఆహార పొట్లాలు అందించడం వంటివి విరివిగా చేపట్టాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తన పెద్ద మనసుని చాటుకున్నారు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. తనను ఎంతగానో అభిమానించే తెలుగు రాష్ట్రాల ప్రజలు కష్ట సమయంలో ఉన్నప్పుడు వారికి అండగా ఉండటం బాధ్యతగా భావించిన ఆయన తన ఉదారతను చాటుకున్నారు. దీనిలో భాగంగా తన వంతు బాధ్యతగా ఆయన రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక్కో దానికి రూ.50 లక్షలు చొప్పున రూ.1 కోటి భారీ విరాళం ప్రటించిన విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయనున్నట్టు ఇటీవలే ఓ పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించారు మెగాస్టార్.
ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా తాను ప్రకటించిన రూ.50 లక్షలతో పాటుగా ఆయన తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రకటించిన మరో రూ.50 లక్షల చెక్కును కూడా సీఎంకు అందించారు. ఈ సందర్భంగా వరద బాధితుల సహాయర్ధం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి మొత్తం రూ.1 కోటి విరాళంగా అందించారు. ఈ మేరకు జూబిహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన చిరంజీవి ఈ రెండు చెక్కులను అందజేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: