వేట్టైయాన్.. ఆడియో అండ్ ప్రివ్యూ ఈవెంట్‌ డేట్ ఫిక్స్

Superstar Rajinikanth's 170th Film Vettaiyan Audio and Prevue Event Date and Venue Fix

కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘వేట్టైయాన్‌’. తలైవా 170గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘జై భీమ్‌’ ఫేమ్ టీజే జ్ఞానవేళ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంచ్ చేసిన టైటిల్‌ టీజర్‌ సినిమాపై సూపర్ హైప్‌ క్రియేట్ చేసింది. దుషారా విజయన్‌, రితికా సింగ్‌ ఫీమేల్‌ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రానా దగ్గుబాటి, రావు రమేశ్‌, రోహిణి మొల్లేటి ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే ప్రముఖ మలయాళ నటి మంజు వారియర్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ నుండి ఫ‌స్ట్ సింగిల్‌ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తెలుగు సహా కన్నడ, తమిళం, మలయాళం మరియు హిందీ భాషల్లో దీనిని విడుదలచేశారు. సాంగ్ అయితే అదిరిపోయింది. ఇందులో సూపర్ స్టార్ తన స్టైల్ స్వాగ్‌తో అలరించారు. ఇదిలావుంటే, తాజాగా వేట్టైయాన్ నుంచి ఓ సాలిడ్ అప్‌డేట్ వచ్చింది.

ఈ మూవీ ఆడియో అండ్ ప్రివ్యూ ఈవెంట్‌ను త్వరలో గ్రాండ్‌గా నిర్వహించనున్నట్టు మేకర్స్ తెలిపారు. ఇందుకు సంబంధించి తేదీ మరియు వేదికను ప్రకటించారు. ఈ మేరకు చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో వెల్లడించింది. “మీ క్యాలెండర్‌లో డేట్ మార్క్ చేసుకోండి! వేట్టైయాన్ ఆడియో & ప్రీవ్యూ ఈవెంట్ సెప్టెంబర్ 20న నెహ్రూ స్టేడియంలో సాయంత్రం 6 గంటల నుండి జరుగుతుంది. నక్షత్రాలతో కూడిన సాయంత్రం కోసం సెట్ చేసుకోండి! అక్టోబరు 10న తమిళం, తెలుగు, హిందీ & కన్నడ భాషల్లో వేట్టైయాన్ విడుదల కానుంది” అని అందులో పేర్కొంది.

కాగా లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ సుభాస్కరన్‌ నిర్మిస్తున్న వేట్టైయాన్‌ మూవీకి మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుధ్ రవిచందర్‌ మ్యూజిక్‌ మరియు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నాడు. కాగా వేట్టైయాన్‌ సినిమాను దసరా కానుకగా అక్టోబర్‌ 10న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలచేయన్నారు మేకర్స్‌. ఇక ఇదిలావుంటే, మరోవైపు క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘తలైవా 171’గా తెరకెక్కుతోన్న ‘కూలి’ చిత్రంలో కూడా రజినీకాంత్ నటిస్తున్న విషయం తెలిసిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.