సూపర్ స్టార్ రజినీకాంత్-సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూలీ.రీసెంట్ గా కాస్టింగ్ ను రివీల్ చేసి సినిమాపై అంచనాలను డబుల్ చేశారు.ఇందులో కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నాడు.సినిమాలో తన పాత్ర పేరు కాలీషా.అయితే ఇక ఈసినిమా ఒప్పుకోవడానికి కారణం ఏంటో ఉపేంద్ర వెల్లడించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కూలీ లో రోల్ కోసం లోకేష్ తనను కలవడానికి వచ్చాడు.వచ్చి స్టోరీ లైన్ చెప్పాడు.ఆతరువాత చాలు ఇంకా చెప్పొద్దూ, నేను ఈసినిమాలో నటిస్తా అని చెప్పా.ఎందుకంటే ఇందులో రజినీకాంత్ వున్నాడు కాబట్టి నేను ఒప్పుకున్నా.ఆయనకు నేను పెద్ద ఫ్యాన్.ఆయన పక్కన నిలబడ్డ చాలు.అయినా సూపర్ స్టార్ సినిమాలో నటించడానికి ఎవరైనా ఆలోచిస్తారా అంటూ చెప్పుకొచ్చాడు ఉపేంద్ర.ఇక ఈసినిమాలో ఉపేంద్ర తోపాటు కింగ్ నాగార్జున ,శృతి హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈసినిమాలో వీరిని ఎలా చూపెట్టనున్నారనేది ఆసక్తిగా మారింది.
ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది.కొద్దీ రోజుల క్రితం నాగార్జున ఈ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.కూలీ లోకేష్ మార్క్ ఎంటర్టైనెర్ గా రానుండగా డిసెంబర్ లో షూటింగ్ ను పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదలచేసేలా ప్లాన్ చేస్తున్నారు.ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తుండగా భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























