నేచురల్ స్టార్ నాని32వ మూవీ హిట్ 3 ఇటీవలే గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.హిట్ సిరీస్ లో భాగంగా హిట్ 2 కి సీక్వెల్ గా వస్తుంది ఈసినిమా.ఇక ఈసినిమా షూటింగ్ ఈరోజు హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యింది.నాని ఫస్ట్ డేనే షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.ఇందులో నాని రూత్ లెస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ గా కనిపించనున్నాడు.శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తుండగా వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు.ప్రముఖ డీవోపీ సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫి,మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వీలైనంత తొందరగా ఈసినిమాను పూర్తి చేసి నాని నెక్స్ట్ మూవీని స్టార్ట్ చేయనున్నాడు.అందులో భాగంగా తన 33వ సినిమాను శ్రీకాంత్ ఓదెల తో చేయనున్నాడు. ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన దసరా, నాని కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఇక ఇప్పుడు రానున్న 33వ సినిమా అంతకు మించిన యాక్షన్ తో తెరకెక్కనుంది.దసరా నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈసినిమాను నిర్మించనున్నాడు.
ఇక రీసెంట్ గా సరిపోదా శనివారంతో వచ్చి నాని మరో బ్లాక్ బాస్టర్ ను ఖాతాలో వేసుకున్నాడు.నిన్నటి తో మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈసినిమా డీసెంట్ రన్ ను కొనసాగిస్తూ 100కోట్ల వైపు పరుగులు తీస్తుంది.ఈసినిమాను వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేయగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది.ఎస్ జె సూర్య విలన్ పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.జేక్స్ బేజాయ్ సంగీతం అందించాడు.డివివి ఎంటర్టైన్మెంట్ నిర్మించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























