నవ దళపతి సుధీర్ బాబు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మా నాన్న సూపర్ హీరో’తో అలరించబోతున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో CAM ఎంటర్‌టైన్‌మెంట్, V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్ణ హీరోయిన్ గా నటించగా.. సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా నేచురల్ స్టార్ నాని ఈ సినిమా టీజర్‌ను లాంచ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అభిలాష్ కంకర మాట్లాడుతూ.. “మై ఫాదర్ ఈజ్ మై సూపర్ హీరో. నేను ఇక్కడ ఉండటానికి కారణం కూడా మా నాన్నే. ఆయన చాలా సపోర్ట్ చేశారు. ఫాదర్ అండ్ సన్ మధ్య జరిగే బ్యూటీఫుల్ స్టొరీ ఇది. ఈ సినిమా చేయడానికి బ్యూటీఫుల్ టీం దొరికింది. నిర్మాతలు వంశీ గారు సునీల్ గారు చాలా సపోర్ట్ చేశారు. ఇది హార్ట్ వార్మింగ్ ఫిలిం అవుతుంది. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు” అని అన్నారు.
ఇక ఇందులో కీలక పాత్ర పోషించిన నటుడు సాయాజీ షిండే మాట్లాడుతూ.. “నా కెరీర్ లో చాలా సినిమాలు చేశాను. ఈ సినిమా చేసినందుకు గర్వంగా వుంది. సుధీర్ బాబుకి ఫాదర్ గా యాక్ట్ చేయడం ప్రౌడ్ గా వుంది. ఈ సినిమా చేసినప్పుడు నాన్న గుర్తుకు వచ్చారు. ఈ సినిమాని అందరూ థియేటర్స్ లో చూడండి. సినిమాని సూపర్ డూపర్ హిట్ చేయండి” అని కోరారు.
అలాగే సుధీర్ బాబు సరసన కథానాయికగా నటించిన హీరోయిన్ ఆర్ణ మాట్లాడుతూ.. “మై ఫాదర్ ఈజ్ మై సూపర్ హీరో. ఇంత బ్యూటీఫుల్ ఫిలిం లో పార్ట్ కావడం చాలా ఆనందంగా వుంది. చాలా మంచి ఎమోషన్ వున్న సినిమా ఇది. దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు” అని తెలిపారు. అక్టోబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: