తంగలాన్.. సెకండ్ వీక్‌లో పెరిగిన స్క్రీనింగ్స్

Thangalaan Screening in 141 Extra Theatres in Second Week

ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన పెద్ద సినిమాలలో ‘తంగలాన్’ ఒకటి. భారీ నిర్మాణ విలువలు, చియాన్ విక్రమ్ అద్భుత నటనతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించింది. దర్శకుడు పా రంజిత్ మరోసారి తన వెండితెర మాయాజాలం చేశాడు. ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీ ఈ నెల 15న థియేటర్స్‌ లోకి వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. అన్ని సెంటర్స్ నుంచి సక్సెస్‌ఫుల్‌ టాక్‌తో పాటు మంచి కలెక్షన్స్ రాబడుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మొదటి వారంతో చూస్తే రెండో వారంలో “తంగలాన్” సినిమాకు తెలంగాణ, ఏపీలో అదనంగా 141 థియేటర్స్ పెరిగాయి. నైజాం ఏరియాలోనే 90 థియేటర్స్ జోడించారు. తెలుగు స్ట్రైట్ సినిమాలతో పాటు విడుదలైన తంగలాన్ గట్టి పోటీని తట్టుకుని బాక్సాఫీస్ వద్ద బలంగా నిలబడింది. ఈ సినిమా దిగ్విజయానికి రెండో వారంలోనూ భారీగా పెరిగిన ఈ థియేటర్స్ నిదర్శనంగా నిలుస్తున్నాయి.

తంగలాన్ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందించగా.. నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. పశుపతి, హరికృష్ణన్, అన్భుదురై తదితరులు కీలక పాత్రలు పోషించారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామా కథతో మ్యాజికల్ రియలిజం స్క్రీన్‌ప్లేతో తెరకెక్కిన తంగలాన్ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.