మెగా హీరో వరుణ్ తేజ్,పలాస ఫేమ్ కరుణ కుమార్ కాంబోలో వస్తున్న చిత్రం మట్కా.1980 బ్యాక్ డ్రాప్ తో వస్తుంది.ఇందులో వరుణ్ డాన్ పాత్రలో కనిపించనున్నాడు.ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ కాకినాడ లో జరుగుతుంది.ఈసందర్భంగా మేకర్స్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.ఈషెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.వరుణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది ఈసినిమా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో మీనాక్షి చౌదరి,నోరా ఫతేహి హీరోయిన్లు గా నటిస్తుండగా నవీన్ చంద్ర, సలోని, అజయ్ ఘోష్,కన్నడ కిషోర్,రవీంద్ర విజయ్,పి రవి శంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.వైరా ఎంటర్టైన్మెంట్స్,ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల,రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు.రీసెంట్ గా ఈసినిమా నుండి రిలీజ్ చేసిన వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఈసినిమా విజయం వరుణ్ తేజ్ కు తప్పినసరి కానుంది.గద్దల కొండ గణేష్ తరువాత సోలో హీరోగా అతనికి ఆ రేంజ్ హిట్ పడలేదు.ఈ ఏడాది మార్చిలో ఆపరేషన్ వాలెంటైన్ అంటూ వచ్చినా ఆసినిమా కూడా నిరాశను మిగిల్చింది.దాంతో వరుణ్,మట్కాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు.మరి ఈసినిమా తనకు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో మట్కా థియేటర్లలోకి రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























