కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)’. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడు. స్నేహ, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటించగా ప్రశాంత్, ప్రభుదేవా, అజ్మల్, లైలా, యోగిబాబు, వీటీవీ గణేష్, జయరామ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పీరియాడిక్ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్‍ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకునే పనిలో ఉంది. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే మూవీ నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సూపర్ రెస్పాన్స్ అందుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఒక కీలక అప్‌డేట్ వచ్చింది.
ది గోట్ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ అందించింది. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఈరోజు అధికారికంగా వెల్లడించారు. కాగా భారీ బడ్జెట్‍తో ఏజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. తెలుగులో ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ విడుదలచేస్తుంది.
ఇక ఈ సినిమా తరువాత విజయ్ తన 69వ సినిమాను ‘సతురంగ వెట్టై’ తో దర్శకుడిగా పరిచయం అయిన ‘వాలిమై’ ఫేమ్ హెచ్.వినోత్ తో చేయనున్నాడు. అయితే ఇది పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండదని, ఫక్తు కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుందని వినోత్ తెలిపాడు. దీనికి సంబంధించిన అఫీషియల్ అప్‌డేట్ మాత్రం ది గోట్ రిలీజ్ తరువాతే రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























