బాలీవుడ్ మూవీ స్ట్రీ 2 చరిత్ర సృష్టించింది.సూపర్ హిట్ మూవీ స్త్రీకి సీక్వెల్ గా వచ్చిన ఈసినిమా మొదటి రోజు రికార్డు ఓపెనింగ్స్ ను రాబట్టింది.బుధవారం ప్రీమియర్స్ పడగా యునానిమస్ పాజిటివ్ రివ్యూస్ ను తెచ్చుకుంది.దాంతో నిన్న ఈసినిమా వసూళ్ల వర్షం కురిపించింది.ప్రీమియర్స్ తో 9.40కోట్ల వసూళ్లను రాబట్టగా నిన్న 55.40 కోట్లు రాబట్టింది దాంతో మొత్తం మొదటి రోజు దేశ వ్యాప్తంగా 64.80కోట్ల వసూళ్లను సొంతం చేసుకొని షారుక్ ఖాన్ పఠాన్ రికార్డును తిరగరాసింది.గత ఏడాది పఠాన్ 55కోట్ల ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది.పెద్దగా స్టార్స్ ఎవరు లేకున్నా హర్రర్ కామెడీ జోనర్ లో వచ్చిన స్త్రీ 2 ఈ రేంజ్ కలెక్షన్లను రాబట్టుకోవడం మాములు విషయం కాదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫుల్ రన్ లో ఈసినిమా మరిన్ని రికార్డులు సొంతం చేసుకోవడం ఖాయం.అటు నార్త్ అమెరికా లో స్త్రీ 2 300k వసూళ్లను రాబట్టుకుంది.ఇందులో శ్రద్దా కపూర్,రాజ్ కుమార్ రావు,పంకజ్ త్రిపాఠి,అభిషేక్ బెనర్జీ కీలక పాత్రల్లో నటించగా అమర్ కౌశిక్ తెరకెక్కించాడు.
మచ్ అవైటెడ్ మూవీ గా వచ్చిన ఈసినిమా ఈఏడాది బాలీవుడ్ లో అత్యధిక ఓపెనింగ్స్ ను రాబట్టిన సినిమాగా నిలిచింది.2018 లో వచ్చిన ఫస్ట్ పార్ట్ స్త్రీ మొదటి వారం లో 60కోట్ల వసూళ్లను రాబట్టగా స్త్రీ 2 ఒక్క రోజులో ఆ కలెక్షన్లను క్రాస్ చేసింది.అంతేకాదు గత కొన్ని నెలలు గా సరైన సక్సెస్ లేక డీలా పడ్డ బాలీవుడ్ బాక్సాఫీస్ స్త్రీ 2 వల్ల కళకళలాడుతుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























