కన్నప్ప.. చెంచుల మహారాణిగా మధుబాల

Kannappa Actress Madhubala Playing Key Role as The Chief of Clan Named Pannaga

ట్యాలెంటెడ్ హీరో మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘కన్నప్ప’. ఒకప్పటి బ్లాక్ బస్టర్ ‘భక్త కన్నప్ప’ కు రీమేక్‌గా ఇది తెరకెక్కుతోంది. ‘మహాభారతం’ సీరియల్ ఫేమ్ ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శక‌త్వం వ‌హిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్‌ మూవీపై అంచనాలను పెంచేసింది. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో దేశవ్యాప్తంగా పలు సినీ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు నటిస్తుండటం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భక్తిరస ప్రధానంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో నటిస్తుండగా.. మలయాళ అగ్ర నటుడు మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, కోలీవుడ్ సీనియర్ నటుడు శరత్ కుమార్, ప్రీతి ముకుందన్, కాజల్, సీనియర్ నటి మధుబాల తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరించడంతో పాటుగా సినిమాలో ఒక ముఖ్య పాత్రను పోషిస్తుండటం విశేషం.

ఈ నేపథ్యంలో కన్నప్ప చిత్రం నుంచి మేకర్స్ సాలిడ్ అప్‌డేట్ అందించారు. తాజాగా మధుబాల పాత్రను పరిచయం చేశారు. కన్నప్పలో ఆమె చెంచుల మహారాణిగా నటిస్తున్నట్టు తెలియజేశారు. అలాగే ఆమె పేరు ‘పన్నగ’ అని వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో మధుబాల పాత్రకు సంబంధించి ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కాగా ఇప్పటికే శరత్ కుమార్ ఇందులో ఓ కీలక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. కన్నప్ప తండ్రి ‘నాథనాథుడు’గా ఆయన నటిస్తున్నారు. ఇక త్వరలోనే కన్నప్ప ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు మణిశర్మ, స్టీఫెన్‌ దేవాసి సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.