‘కల్కి 2898 AD’ సినిమాతో ఇటీవలే ప్రేక్షకులముందుకు వచ్చాడు పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుని చరిత్ర సృష్టించింది. విడుదలై నెల దాటినా ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. అయితే అంతకుముందు వచ్చిన ‘సలార్’ మూవీతో దాదాపు రూ. 800 కోట్లు కొల్లగొట్టాడు. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్స్ అందించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలావుంటే, ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’ అనే సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రంలో ప్రభాస్ ఇప్పటిదాకా చేయని పాత్రలో కనిపించనున్నాడు. రొమాంటిక్ హారర్ జానర్‌లో రాజా సాబ్ దర్శకుడు మారుతి రూపొందిస్తుండటంతో ఈ సినిమా మీద అందరిలో క్యూరియాసిటీ ఏర్పడుతోంది.
ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. రిద్ధి కుమార్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్స్ కోసం రెబల్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణకు తెరదించుతూ మేకర్స్ సాలిడ్ అప్‌డేట్ అందించారు. తాజాగా రాజా సాబ్ నుంచి ఫ్యాన్ ఇండియా గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు.
ఈ గ్లింప్స్‌ను గమనిస్తే.. రాజా సాబ్‍లో ప్రభాస్ లుక్, మేకోవర్ చాలా కొత్తగా ఉండబోతున్నట్టు దీనిని చూస్తే తెలుస్తోంది. డార్లింగ్ ఫ్యాన్స్, ప్రభాస్‌ను స్క్రీన్ మీద ఎలా చూడాలనుకుంటున్నారో, డైరెక్టర్ మారుతి అలా రాజా సాబ్ మూవీని రూపొందిస్తున్నట్టు అర్ధమవుతోంది. చేతిలో ఫ్లవర్ బొకేతో లవర్ బాయ్‌లా చాలా స్టైలిష్‌గా కనిపించాడు ప్రభాస్. 45 సెకండ్ల నిడివి ఉన్న ఈ గ్లింప్స్ మూవీపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.
ఇక టాలీవుడ్‌లో సూపర్ హిట్ సినిమాలతో దూసుకెళ్తున్న ప్రెస్టీజియస్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో ఎక్కడా రాజీపడకుండా గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. తద్వారా రాజా సాబ్ ప్రాజెక్ట్ తమ సంస్థలో ఒక మెమొరబుల్ మూవీగా మిగిలిపోవాలని భావిస్తున్నారు. వివేక్ కూఛిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























