బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కొత్త సినిమా

Bellamkonda Sai Sreenivas New Movie BSS12 Announced

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘భీమ్లానాయక్’ ఫేమ్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ‘టైసన్ నాయుడు’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీనితోపాటు ఇటీవలే షైన్ స్క్రీన్ బ్యానర్ నిర్మిస్తోన్న #BSS11 మూవీని పట్టాలెక్కించాడు సాయి శ్రీనివాస్. ఈ క్రమంలో ఆయన తాజాగా మరో కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దివంగత దిగ్గజ దర్శకుడు కోడి రామకృష్ణ గారి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మూన్ షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేష్ చందు నిర్మిస్తున్న ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్‌ 12వ చిత్రంగా (#BSS12) రూపొందుతోంది. ఈ మూవీకి డెబ్యూటెంట్ లుధీర్ బైరెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. శివన్ రామకృష్ణ సమర్పిస్తున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ మూవీ కాబోతోంది.

ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. 400 ఏళ్ల నాటి గుడి నేపధ్యంలో ఒకల్ట్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను మునుపెన్నడూ చూడని అవతార్‌లో ప్రెజెంట్ చేస్తోంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో హీరో పురాతన ఆలయం ముందు నిలబడి ఉన్నాడు. గుడిపై సూర్యకిరణాలు పడడంతో పోస్టర్ మొత్తం డివైన్ వైబ్ కనిపించింది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తుపాకీ పట్టుకుని గుడిని చూస్తున్నారు. పోస్టర్ అదిరిపోయింది, గొప్ప ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.

కాగా అన్ని కమర్షియల్ అంశాలతో కూడిన ఇంట్రస్టింగ్ అండ్ పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్టు దర్శకుడు తెలిపారు. ఇక ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా రేపటి నుంచి రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి అత్యుత్తమ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. డీవోపీగా శివేంద్ర, ఎడిటర్‌గా కార్తీక శ్రీనివాస్ పనిచేస్తుండగా.. లియోన్ జేమ్స్ సంగీతం, శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాలో నటించనున్న ఇతర నటీనటుల వివరాలను వెల్లడించనున్నారు మేకర్స్.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.