ఈ ఏడాది రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో పుష్ప2 కూడా ఒక సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈసినిమా కోసం కేవలం సౌత్ మాత్రమే కాదు నార్త్ ఆడియన్స్ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈమధ్య ఈసినిమాపై పలు వార్తలు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే కదా. ముఖ్యంగా రిలీజ్ డేట్ పై. ముందు ఆగష్ట్ 15న రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ ఇంకా షూటింగ్ పెండింగ్ లో ఉండటంతో ఈసినిమా రిలీజ్ ను వాయిదా వేశారు. ఆగష్ట్ నుండి ఏకంగా డిసెంబర్ కు వాయిదా వేశారు. డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇప్పుడు డిసెంబర్ కు పలు సినిమాలు రిలీజ్ కు లైన్ కడుతున్న నేపథ్యంలో ఈసినిమా రిలీజ్ మళ్లీ వాయిదా పడుతుందన్న వార్తలు గత కొద్దిరోజులుగా చక్కర్లు కొడతున్నాయి. కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ పై మరోసారి క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఏడాది ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమాల లిస్ట్ ను తాజాగా ఐఎండీబీ వారు పోస్ట్ చేశారు. అందులో పుష్ప2 సినిమా మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ లిస్ట్ ను పుష్ప2 మేకర్స్ రీ పోస్ట్ చేస్తూ తగ్గేదేలే అని చెబుతూ డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ అవుతుందని చెబుతూ క్లారిటీ ఇచ్చారు. ఇక పుష్ప2 మేకర్స్ ఇచ్చిన క్లారిటీ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.
ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. చాలా వరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది. బన్నీ షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావస్తుందని.. ఫహాద్ ఫాజిల్, బన్నీ మధ్య వచ్చే సీన్లు పెండింగ్ లో ఉన్నాయన్న అప్ డేట్ ఇప్పటికే వచ్చింది. మరోవైపు ఇప్పటికే ఈసినిమా నుండి పలు అప్ డేట్లు కూడా వచ్చాయి. పలు పోస్టర్లు, గ్లింప్స్, పాటలు రిలీజ్ చేయగా అన్నీ సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేశాయి.
కాగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. అలానే జగపతి బాబు, సునీల్, అనసూయ తో పాటు పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























