కంగువ ఫస్ట్ సింగిల్ ఫైర్ సాంగ్ రిలీజ్

suriya kanguva movie first single fire song out now

తమిళ్ స్టార్ హీరో సూర్య నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కంగువ. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈసినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. టాలెండెట్ డైరెక్టర్ శివ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ కలిసి నిర్మిస్తున్నారు. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ఎన్నో రోజులుగా సస్పెన్స్ లో ఉంచిన రిలీజ్ డేట్ ను రీసెంట్ గానే ప్రకటించారు. అక్టోబర్ 10వ తేదీన దసరా బరిలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే అప్ డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక చెప్పినట్టే నేడు సూర్య బర్త్ డే కావడంతో తాజాగా ఫియర్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. తమిళ్ తో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈసాంగ్ ను విడుదల చేశారు. ఇక సాంగ్ పేరుకు తగ్గట్టే పాట అంతే పవర్ ఫుల్ గా ఉంది. దాదాపు 1000 మంది ఆర్టిస్టులతో ఉన్న ఈసాంగ్ భారీ స్థాయిలో ఉంది. మొత్తానికి సూర్య బర్త్‌ డే సాంగ్‌ గూస్‌బంప్స్‌ తెప్పించేలా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

కాగా దిశా పటాని హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో బాబీ డియోల్, దిశా పటానీ, నటరాజన్ సుబ్రమణియం, జగపతి బాబు, యోగిబాబు, రెడిన్ కింగ్‍స్లే కీలకపాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.