కృష్ణ వంశీ హీరోగా పరిచయం అవుతూ చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా అలనాటి రామచంద్రుడు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ఈసినిమా ఏపీ, తెలంగాణ రిలీజ్ హక్కులను దిల్ రాజు నిర్మాణ సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారు సొంతం చేసుకోవడంతో ఈసినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను రీసెంట్ గానే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమాను ఆగష్ట్ 2వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా నుండి నాపేరు నువ్వై అంటూ వచ్చే మెలోడి సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. చంద్రబోస్ లిరిక్స్ అందించిన ఈపాటను రితూ వైశఖ్, దినకర్ కల్వల ఆలపించారు. మెలోడియస్ గా ఉన్న ఈపాట అయితే ఆకట్టుకుంటుంది
కాగా ఈసినిమా మోక్ష హీరోయిన్ గా నటిస్తుండగా.. ఇంకా బ్రహ్మాజీ, సుధ, ప్రమోదిన, చైతన్య గరికిపాటి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను హైనివా క్రియేషన్స్ బ్యానర్ పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. శశాంక్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























