మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ ఏడాది వరుణ్ తేజ్ వాలంటైన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే ఆసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. కరుణ్ కుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా మట్కా. యధార్థ సంఘటనల ఆధారంగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి ఓపెనింగ్ బ్రాకెట్ అంటూ ఒక గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేయగా.. నిమిషమున్నర నిడివి ఉన్న ఈ గ్లింప్స్ ఆకట్టుకుంది.
ఇదిలా ఉండగా రీసెంట్ గానే ఈసినిమా మూడో షెడ్యూల్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. రామోజీ ఫిలిం సిటీలో వేసిన పీరియాడిక్ వైజాగ్ సెట్స్ లో ఈ సినిమా షూట్ ను చేస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు ఈ షెడ్యూల్ దాదాపు 30 రోజులకు పైగా ఉండనుంది. ఇక ఇప్పుడు ఈసినిమా షూటింగ్ గురించి మరో అప్ డేట్ ఇచ్చాడు వరుణ్ తేజ్. షూటింగ్ అండర్ ప్రోగ్రెస్ అంటూ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
కాగా ఈసినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ కూడా కీలక పాత్రలో నటిస్తుంది. నవీన్ చంద్ర మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను పాన్ ఇండియా లెవల్లో భారీ స్థాయిలో నిర్మించనున్నారు. వైరా ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాను తెలుగు తో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళంలో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. జీవి ప్రకాష్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా కిషోర్ కుమార్ పనిచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























