బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా విశ్వంభర. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తిచేసుకుంటున్న సంగతి తెలిసిందే. హైద్రాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు. అంతేకాదు ఆగష్ట్ లోపు ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని చూస్తున్నారు చిత్రబృందం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా డబ్బింగ్ పనులను పూజా కార్యక్రమాలతో ప్రారంభించినట్టు తెలిపారు. ఒకపక్క షూటింగ్ ను జరుపుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పార్లల్ గా పూర్తిచేయనున్నట్టు తెలిపారు.
కాగా ఈసినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా.. సురభి ,ఈషా చావ్లా, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ఈసినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వి వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌రెడ్డి నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీకి చోటా కె నాయుడు ఫోటోగ్రఫి అందించనున్నారు. ఈసినిమాను వచ్చేే ఏడాది సంక్రాంతికి జనవరి 10వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























