టాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. జీనియస్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని తదితరులు నటించారు. అగ్రనిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా జూన్ 27న గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మైథాలజీ-ఇన్స్‌స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్‌గా తెరకెక్కిన కల్కి సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షుల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. దీంతో ఈ విజువల్ వండర్ ఎపిక్ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ చిత్రం కేవలం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్లో సైతం రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో హౌస్‌ఫుల్‌గా రన్ అవుతుండటం విశేషం. ఈ క్రమంలో తాజాగా రూ. 700 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టింది కల్కి.
మరోవైపు కల్కి వంటి అద్భుతమైన సినిమా ఇంతవరకూ ఇండియన్ స్క్రీన్‌పై రాలేదని ప్రేక్షకులు కితాబిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత, వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్వనీదత్ కల్కి మూవీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఈ మేరకు తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంగా కల్కి సినిమా బడ్జెట్ గురించి తెలిపారు.
దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి 2898 ఏడీ కథ మొదట చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యపోయానని, ఇలాంటి సినిమా తెరకెక్కించాలంటే చాలా బడ్జెట్ అవసరమవుతుందని అప్పుడే గెస్ చేశానని చెప్పారు. ఇక కల్కి మూవీని తీయడానికి దాదాపు రూ. 700 కోట్ల బడ్జెట్ అయిందని, అయితే దీని గురించి తామెప్పుడూ భయపడలేదని తెలిపారు.
ఇంకా అశ్వనీదత్ మాట్లాడుతూ.. ఎందుకంటే, ఈ స్టోరీని తాము పూర్తిగా నమ్మామని, మన ఇతిహాసాలకు సైన్స్ ఫిక్షన్ జోడించి తీయడం అనేది ఇదే తొలిసారని గుర్తుచేసిన ఆయన, తప్పనిసరిగా ఈ ప్రయత్నం ఫలిస్తుందని భావించామని అన్నారు. ఇక కల్కి బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం తొలినుంచీ ఉందని, తమ నమ్మకాన్ని నిజం చేస్తూ ఇప్పుడు కల్కి థియేటర్లలో దూసుకుపోతోందని చెప్పారు. కాగా కల్కి ఇప్పటివరకూ 7 రోజుల్లో మొత్తం రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం గమనార్హం.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























