స్కంద తరువాత రామ్ నుండి వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్.బ్లాక్ బాస్టర్ ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వస్తుంది.రీసెంట్ గా రిలీజైన టీజర్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్నాడు.చాలా గ్యాప్ తరువాత రీసెంట్ గా షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది.ఇక ఈ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.మరో మూడు పాటల షూట్ బ్యాలెన్స్ వుంది.అందులో రెండు పాటలను హైదరాబాద్ లో మరొకటి గోవాలో చిత్రీకరించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జూలై మొదటి వారంలోగా ఈ షూట్ మొత్తం కంప్లీట్ చేసి ఆగస్టు లేదా సెప్టెంబర్ లో సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.ఇందులో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుండగా సంజయ్ దత్ విలన్ రోల్ చేస్తున్నాడు.మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.పూరి,ఛార్మి నిర్మిస్తున్నారు. ఈసినిమాపై మంచి అంచనాలు వున్నాయి.
ఇక రామ్ డబుల్ ఇస్మార్ట్ కు ముగింపు దశకు చేరుకోవడంతో తన తదుపరి సినిమాలపై ఫోకస్ చేశాడు.అందులో భాగంగా రెండు కొత్త సినిమాలకు సైన్ చేశాడట.ఇందులో రామ్, హరీష్ శంకర్ తో ఓ సినిమా చేయనుండగా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి డైరెక్టర్ మహేష్ బాబు తో మరో సినిమా చేయనున్నాడు .ఈసినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుందట.మరి ఈ రెండు సినిమాల్లో ముందుగా ఏసినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తాడో చూడాలి.అయితే ఈ రెండు సినిమాలను అధికారికంగా ప్రకటించాల్సివుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























