రామోజీకి భార‌త‌ర‌త్న ఇవ్వాలి-రాజమౌళి

ramoji rao deserves bharat ratna says rajamouli

మీడియో మొగల్ రామోజీరావు నేడు మృతి చెందిన సంగతి తెలిసిందే కదా. గత కద్దిరోజులుగా అనారోగ్యంతో భాధపడుతున్న ఆయన నేడు తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన భౌతిక కాయాన్ని రామోజీ ఫిలిం సిటీలో ఉంచగా.. ఇక కడసారి ఆయన పార్థీవదేహాన్ని చూసేందుకు వెండితెర, బుల్లితెర ప్రముఖులతో పాటు, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా అక్కడికి వస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈనేపథ్యంలో దర్శకధీరుడు రాజమౌళి కూడా రామోజీరావు పార్టీవ దేహాన్ని దర్శించుకొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఏ రంగంలో అయినా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక ముద్ర‌ను వేసుకుని, గెలుపు త‌లుపులు త‌ట్టిన మ‌హ‌నీయుడు రామోజీ రావు.. ఎన్నో సంస్థ‌ల‌ను నెల‌కొల్పి, స‌రికొత్త ఆలోచ‌న‌ల‌తో వాటిని శిఖరాల‌కు తీసుకెళ్లిన ఒకే ఒక వ్య‌క్తి రామోజీ రావు.. ఆయ‌న‌కు భార‌త‌ర‌త్న ను అందించడ‌మే మ‌నం ఇవ్వ‌గ‌లిగే అస‌లైన నివాళి అన్నారు.

ఇక రామోజీరావు మనవుడు యూఎస్ నుండి రావాల్సి ఉండటంతో కుటుంబసభ్యులు ఆయన కోసం వేచి చూస్తున్నారు. ఆయన వచ్చిన అనంతరం అంత్యక్రియలు రేపు రామోజీ ఫిలిం సిటీలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.