టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో శర్వానంద్ తన ల్యాండ్‌మార్క్ 35వ మూవీ ‘మనమే’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై రామ్‌సే స్టూడియోస్ ప్రొడక్షన్‌లో నిర్మాత టిజి విశ్వప్రసాద్ అత్యంత గ్రాండ్‌గా నిర్మించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్‌తో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో ‘మనమే’ నేడు (శుక్రవారం,జూన్ 7) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలయింది. ఈ క్రమంలో మేకర్స్ అంతకుముందు ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ శర్వానంద్‌కు ‘ఛార్మింగ్ స్టార్’ టైటిల్ ఇచ్చారు. ఈ మేరకు రూపొందించిన స్పెషల్ వీడియోను ఈవెంట్‍లో ప్రజెంట్ చేశారు. గ్రాండ్‌గా జరిగిన ఈ వేడుకలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ మారుతి, శివ నిర్వాణ, సాయి రాజేష్, కిషోర్ తిరుమల అతిధులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హీరోయిన్ కృతిశెట్టి మాట్లాడుతూ.. శర్వా గారితో సినిమా చేస్తున్నాని మా ఫ్రెండ్స్‌కి చెబితే.. ఫుల్ ఫ్యామిలీతో వెళ్లి చూస్తామని చెప్పారు. ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్ కూడా శర్వా గారితో చాలా కనెక్ట్ అవుతారు. పేరెంట్స్‌తో వచ్చి చూడండి. చాలా ఫీల్ గుడ్ సినిమా ఇది. శర్వాగారు అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. శ్రీరామ్ గారు కథ చెప్పినప్పుడు ఎలాంటి మ్యాజిక్ కనిపించిందో సినిమా చూస్తున్నప్పుడు కూడా అదే మ్యాజిక్ ఫీల్ అయ్యాను” అని చెప్పారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ.. “ఈ సినిమా పార్ట్ చేసిన డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య గారికి థాంక్స్. విక్కీ అన్ బిలివబుల్. తను చేసిన ప్రతి సీన్ చాలా ఎమోషనల్‌గా అనిపించింది. హేశం బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్స్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. వారితో మరోసారి కలసి పని చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాని ఫ్యామిలీతో వచ్చి చూడండి. తప్పకుండా అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది” అని హీరోయిన్ కృతిశెట్టి అన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























