విజయ్ దేవరకొండ -రవికిరణ్ కోలా మూవీ షూటింగ్ అప్డేట్ 

Svc 59 shooting will begin soon

రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ తో పలకరించిన సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం  ఫ్యామిలీ తో కలిసి ట్రిప్ లో వున్నాడు. విజయ్ ఇటీవలే తన 12వ సినిమా వైజాగ్ షెడ్యూల్ ను కంప్లీట్ చేశాడు.గౌతమ్ తిన్ననూరి  డైరెక్షన్ లో ఈసినిమా తెరకెక్కుతుంది.ఇక ఈనెల 18న ఇండియాకు తిరిగి రానున్నాడు విజయ్.వచ్చిన వెంటనే శ్రీలంక కు పయనం కానున్నాడు. కొలొంబో లో 12వ సినిమా  కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది.సితార ఎంటర్టైన్మెంట్స్ ఈసినిమాను నిర్మిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలావుంటే విజయ్ తన బర్త్ డే న మరో  రెండు సినిమాలు చేయనున్నానని ప్రకటించాడు.అందులో రాజావారు రాణి గారు ఫేమ్ రవికిరణ్ కోలా తో ఓ సినిమా  వుంది.ఈసినిమా సెప్టెంబర్ లో సెట్స్ మీదకు వెళ్లేందుకు రెడీ అవుతుంది. షూటింగ్ ను కాకినాడ ,హైదరాబాద్,వైజాగ్ లో పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు.అవుట్ ఆండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా రానుంది.దిల్ రాజు నిర్మించనున్నాడు.వచ్చే ఏడాది సమ్మర్ లో  విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఈసినిమా తోపాటు టాక్సీ వాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ తో కూడా విజయ్ సినిమా  చేయనున్నాడు.పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో రానుంది.మైత్రి మూవీస్ నిర్మించనుంది.ఈసినిమా ఈఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ వుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.