పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కూడా ట్రెండ్ సెట్ చేశాడు. గత పదేళ్లు నుండి అభిమానులు ఎదురుచూస్తున్న రోజులు వచ్చేశాయి. ఏపీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. ఇందులో పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ 21 సీట్లు మాత్రమే తీసుకోగా.. వందకు వంద శాతం స్ట్రైట్ రేట్ తో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయాన్ని సాధించి కూటమి గెలుపుకు ముఖ్య కారకుడయ్యాడు. పవన్ కూడా తాను పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలుపొందాడు. ఇక రిజల్ట్ వచ్చి రెండు రోజులు అవుతుంది. పవన్ ఈ రెండు రోజులు బిజీగానే ఉన్నారు. పార్టీ నేతలతో సమావేశం తరువాత ఢిల్లీ వెళ్లి మోడీని కలిశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు ఫైనల్ గా మెగా ఫ్యామిలీని కలిశారు. ఇక మెగాస్టార్ నివాసానికి వచ్చిన పవన్ కు గ్రాండ్ వెల్ కమ్ పలికారు మెగా ఫ్యామిలీ సభ్యులు. పూల వర్షం కురిపిస్తూ.. హారతినిచ్చి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పవన్ తల్లి, వదిన చిరంజీవి ఆశీర్వాదాలు తీసుకున్నారు. పవన్ కల్యాణ్‌పై భారీ పూలమాల వేసిన చిరంజీవి ఆత్మీయ ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశాడు. ఆ తరువాత కుటుంబసభ్యులంతా కలిసి పవన్ కల్యాణ్‌తో కేక్ కట్ చేయించారు. దీంతో మెగా సెలబ్రేషన్స్ చూసి ఫ్యాన్స్ ఆనందంలో మునిగితేలుతున్నారు.
FRAMES OF THE DAY!📸
Power star @PawanKalyan visits Megastar @KChiruTweets house and meets the Mega family after his victory as MLA!❤️🔥#Chiranjeevi #PawanKalyan #RamCharan #SaiDurghaTej #VarunTej #AkiraNandan #TeluguFilmNagar pic.twitter.com/5us8JtlW4B— Telugu FilmNagar (@telugufilmnagar) June 6, 2024
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































