ఈమధ్య నిర్మాణ సంస్థలు కూడా డిస్ట్రిబ్యూషన్ వైపు మొగ్గుచూపుతున్నాయి. సినిమాను తాము నిర్మించకపోయినా రిలీజ్ చేయడానికి మాత్రం ముందుకు వస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్లో టాప్ ప్రొడక్షన్ హౌస్ లు కూడా ఈ పంథాలోకి వచ్చాయి. అందులో మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఒకటి. ఒకపక్క సినిమాలు నిర్మిస్తూనే మరోపక్క డిస్ట్రిబ్యూషన్ లో కూడా తన సత్తా చాటుతుంది అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మైత్రీ మూవీ మేకర్స్ నుండి పలు సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు నాలుగు సినిమాల నైజాం హక్కులను మైత్రీ వారు సొంతం చేసుకున్నారు. కార్తికేయ హీరోగా వస్తున్న భజే వాయు వేగం సినిమా నైజాం హక్కులను మైత్రీ వారు సొంతం చేసుకున్నారు. ఈసినిమా మే 31వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇంకా ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తున్న గం గం గణేశా మూవీ నైజాం హక్కులను, కాజల్ ఆగర్వాల్ ప్రధాన వస్తున్న సత్యభామ నైజాం హక్కులను, శర్వానంద్ హీరోగా వస్తున్న మనమే మూవీ నైజాం హక్కులను సొంతం చేసుకుంది. గం గం గణేశా మూవీ మే31వ తేదీన రిలీజ్ అవుతుండగా.. సత్యభామ మూవీ జూన్ 7వ తేదీన, మనమే మూవీ జూన్ 7వ తేదీన రిలీజ్ కానున్నాయి.
Your entertainment for the next two weeks is sorted🔥👌🏽
This summer ends with WHOLESOME ENTERTAINERS coming your way.
Glad to bring all these films to the audience in Nizam.#BhajeVaayuVegam on May 31st#GamGamGanesha on May 31st#Satyabhama on June 7th#Manamey on June 7th pic.twitter.com/uBPCNgzPpa
— Mythri Movie Distributors LLP (@MythriRelease) May 26, 2024
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























