ముకుంద సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన మెగా హీరో వరుణ్ తేజ్. మొదటి సినిమా అంతలా విజయం సాధింకపోయినా ఆ తరువాత ఫిదా సినిమాతో మాత్రం మంచి హిట్ ను కొట్టి ఆ తరువాత తొలిప్రేమ, గద్దలకొండ గణేష్, ఎఫ్ 2 ఇలా వరుస విజయాలు అందుకొని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. అయితే ఈమధ్యకాలంలో సరైన హిట్ ను అందుకోలేకపోయాడు వరుణ్. దీంతో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం తన నుండి రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా మార్చి1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన టీజర్, పాటలు అన్నీ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి ఫైనల్ స్ట్రైక్ ను రిలీజ్ చేస్తున్నట్టు రెండు రోజుల నుండి అప్ డేట్లు ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా ఫైనల్ స్ట్రైక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, హిందీలో సల్మాన్ ఖాన్ రిలీజ్ చేశారు. ఫైనల్ స్ట్రైక్ అయితే ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ ఈసినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచేలా కనిపిస్తున్నాయి. ఫైనల్ స్ట్రైక్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.
The #OPVFinalStrike is here and looks massive. Very proud of my brother @IAmVarunTej for always picking up unique films and this time a film that whole the nation will be proud of!https://t.co/XmBtYAxF9L
Good luck to the entire team of #OperationValentine 🤗 Looking forward to… pic.twitter.com/RReXLSn5YA
— Ram Charan (@AlwaysRamCharan) February 20, 2024
కాగా ఈసినిమాలో మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లార్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో రాడార్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. శక్తి ప్రతాప్ సింగ్ హడా, అమీర్ ఖాన్, సిద్ధార్థ్ రాజ్ కుమార్ రాసిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ సందీప్ ముద్ద భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























