శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో, భారత వైమానిక దళ ధైర్య సాహసాలని చూపే ఈ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాలో లో వరుణ్ తేజ్ బ్రేవ్ ఎయిర్ ఫోర్స్ ఫైలట్ గా నటిస్తున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా మార్చి1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచారు. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లను అలానే టీజర్, పాటలను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. త్వరలో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా ట్రైలర్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా సంగీత దర్శకుడు అయిన మిక్కీ జే మేయర్ ట్రైలర్ కు ఆర్ఆర్ వర్క్ ను మొదలుపెట్టారని.. ట్రైలర్ అనౌన్స్ మెంట్ త్వరలోనే వస్తుందని తెలిపారు.
Get ready to feel the high🔥
Sensational Music Director @MickeyJMeyer Begins the RR work for #OperationValentine Trailer💥
A sensational trailer with high emotions coming your way ❤️🔥
TRAILER ANNOUNCEMENT SOON 🔥#OPVonMarch1st@IAmVarunTej @ManushiChhillar @ShaktipsHada89… pic.twitter.com/foG9pIQ82y
— BA Raju’s Team (@baraju_SuperHit) February 17, 2024
కాగా ఈసినిమాలో మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లార్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో రాడార్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. శక్తి ప్రతాప్ సింగ్ హడా, అమీర్ ఖాన్, సిద్ధార్థ్ రాజ్ కుమార్ రాసిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ సందీప్ ముద్ద భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























