త్వరలోనే సెలబ్రిటీ క్రికెట్ లీగ్.. జట్ల వివరాలు, పూర్తి షెడ్యూల్ ఇదే..!

Celebrity Cricket League 2024 Complete Schedule

భారతీయ చిత్ర పరిశ్రమలలోని హీరోలు బాక్సాఫీస్ బరిలోనే కాకుండా క్రికెట్ గ్రౌండ్ లోనూ తలపెడుతుంటే చూడటానికి రెండు కళ్ళూ సరిపోవు అభిమానులకు. సినీ ప్రియులు మరియు క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ తరుణం రానే వచ్చింది. త్వరలోనే వీరందరూ తమ చిత్ర పరిశ్రమల తరపున బరిలోకి దిగి హోరాహోరీగా పోరాడనున్నారు. ఈ సంరంభానికి సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) వేదిక కానుంది. కాగా ఈ ఏడాది సీసీఎల్ టోర్నీలో మొత్తం 8 జట్లు తలపడనున్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, పంజాబీ, భోజ్‍పురి, బెంగాలీ తదితర భాషల సినీ ఇండస్ట్రీల నటులు ఈ టోర్నీలో తలపడటానికి సిద్ధమయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ ఏడాది టోర్నీ ఫిబ్రవరి 23 నుంచి మార్చి 17 వరకు జరగనుండగా.. ఫైనల్‍తో కలిసి మొత్తంగా 20 మ్యాచ్‍లు ఉంటాయి. అయితే తొలి మూడు రోజుల మ్యాచ్‍లకు షార్జా వేదిక కానుండగా.. తదుపరి మ్యాచ్‍లకు హైదరాబాద్, చండీగఢ్, త్రివేండ్రం, వైజాగ్‍ స్టేడియాలు ఆతిథ్యమివ్వనున్నాయి. టాలీవుడ్ తరపున అఖిల్ అక్కినేని కెప్టెన్‍గా ఉన్న తెలుగు వారియర్స్ డిఫెండింగ్ చాంపియన్‍గా బరిలోకి దిగుతోంది. కాగా ఈ సీసీఎల్ మ్యాచ్‍లు జియో సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో లైవ్ స్ట్రీమింగ్ కానున్నాయి. అలాగే జీ సినిమాలు ఛానెల్‍లో తెలుగులో లైవ్ టెలికాస్ట్ ఇవ్వనున్నారు. ఉచితంగా ఈ మ్యాచ్‍ల లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చని సదరు ప్లాట్‍ఫామ్‍ స్పష్టం చేసింది.

సీసీఎల్ 2024లో పాల్గొంటున్న 8 జట్లు ఇవే..!

  • తెలుగు వారియర్స్
  • ముంబై హీరోస్
  • చెన్నై రైనోస్
  • కర్ణాటక బుల్డోజర్స్
  • కేరళ స్ట్రైకర్స్
  • బెంగాలీ టైగర్స్
  • భోజ్‍పురి దబాంగ్స్
  • పంజాబ్ దె షేర్

సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ 2024 పూర్తి షెడ్యూల్ ఇదే..!

  • ముంబై హీరోస్ vs కేరళ స్ట్రైకర్స్ – షార్జా (ఫిబ్రవరి 23, రాత్రి 7:00)
  • తెలుగు వారియర్స్ vs భోజ్‍పురి దబాంగ్స్ – షార్జా (ఫిబ్రవరి 24, మధ్యాహ్నం 2:30)
  • కేరళ స్ట్రైకర్స్ vs బెంగాల్ టైగర్స్ – షార్జా (ఫిబ్రవరి 24, రాత్రి 7:00)
  • చెన్నై రైనోస్ vs పంజాబ్ దే షేర్ – షార్జా (ఫిబ్రవరి 25, మధ్యాహ్నం 2:30)
  • ముంబై హీరోస్ vs కర్ణాటక బుల్డోజర్స్ – షార్జా (ఫిబ్రవరి 25, రాత్రి 7:00)
  • చెన్నై రైనోస్ vs భోజ్‍పురి దబాంగ్స్ – హైదరాబాద్ (మార్చి 1, మధ్యాహ్నం 2.30)
  • తెలుగు వారియర్స్ vs పంజాబ్ దె షేర్ – హైదరాబాద్ (మార్చి 1, రాత్రి 7:00)
  • ముంబై హీరోస్ వర్సెస్ బెంగాల్ టైగర్స్ – హైదరాబాద్ (మార్చి 2, మధ్యాహ్నం 2:30)
  • ముంబై హీరోస్ Vs భోజ్‍పురి దబాంగ్స్ – హైదరాబాద్ (మార్చి 2, రాత్రి 7:00)
  • చెన్నై రైనోస్ vs కర్ణాటక బుల్డోజర్స్ – హైదరాబాద్ (మార్చి 3, మధ్యాహ్నం 2:30)
  • తెలుగు వారియర్స్ vs కేరళ స్ట్రైకర్స్ – హైదరాబాద్ (మార్చి 3, రాత్రి 7:00)
  • పంజాబ్ దె షేర్ vs బెంగాల్ టైగర్స్ – చండీగఢ్ (మార్చి 8, రాత్రి 7:00)
  • బెంగాల్ టైగర్స్ vs భోజ్‍పూరి దబాంగ్స్ – చండీగఢ్ (మార్చి 9, మధ్యాహ్నం 2:30)
  • పంజాబ్ దె షేర్ vs ముంబై హీరోస్ – చండీగఢ్ (మార్చి 9, రాత్రి 7:00)
  • తెలుగు వారియర్స్ vs కర్ణాటక బుల్డోజర్స్ – త్రివేండ్రం (మార్చి 10, మధ్యాహ్నం 2.30)
  • చెన్నై రైనోస్ vs కేరళ స్ట్రైకర్స్ – త్రివేండ్రం (మార్చి 10, రాత్రి 7:00)
  • ప్లేఆఫ్స్ – క్లాలిఫయర్ 1 – మార్చి 15 – వైజాగ్ (మధ్యాహ్నం 2.30)
  • ప్లేఆఫ్స్ – ఎలిమినేటర్ 1 – వైజాగ్ (మార్చి 15, 7:00)
  • ప్లేఆఫ్స్ – క్వాలిఫయర్ 2 – వైజాగ్ (మార్చి 16, 7:00)
  • ఫైనల్ మ్యాచ్ – వైజాగ్ (మార్చి 17, రాత్రి 7:00)
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.