కన్నప్ప కథపై మంచు విష్ణు క్లారిటీ

kannappa is real story not mythological says manchu vishnu

చాలా గ్యాప్ తరువాత విష్ణు మంచు తన డ్రీమ్ ప్రాజెక్ట్ తో వచ్చేస్తున్నాడు. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో మహాశివుడి పరమ భక్తుడు భక్తు కన్నప్ప జీవిత నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే న్యూజిలాండ్ లో భారీ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈసినిమాతోనే మంచు ఫ్యామిలీ థర్డ్ జనరేషన్ కూడా పరిచయం కాబోతుంది. విష్ణు తనయుడు అవ్రామ్ ఈసినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఈసినిమా కథపై ఇప్పుడు తన సోషల్ మీడియా ద్వారా మంచు విష్ణు క్లారిటీ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఒక వీడియో పోస్ట్ చేస్తూ.. రీసెంట్ గానే ఇన్ స్టాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ జరిగింది.. చాలా మంది చాలా ప్రశ్నలు అడిగారు.. ఎన్నో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కూడా అడిగారు. అయితే కొంతమంది తమిళ్ నాడు నుండి, కర్ణాటకు, నార్త్ నుండి కొంతమంది ఒక ప్రశ్న అడిగారు. అది నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. ప్రశ్న అయితే చాలా సింపుల్.. మీ మైథలాజికల్ మూవీ కన్నప్ప ఎప్పుడు రిలీజ్ అవుతుందని. కానీ మైథలాజికల్ అంటే హిస్టారికల్ గా ప్రూఫ్ లేనిది.. కల్పితమైనది అని అర్థం వస్తుంది.

ఎక్కడో నాసా లో ఉన్నవాళ్లు రామసేతు బ్రిడ్జ్ కి తమిళ నాడు నుండి రామేశ్వరం వరకూ ట్రేసెస్ ఉన్నాయని చెబితే.. అవును రామాయణంలో ఉంది కదా ప్రూఫ్ ఉంది అని డిబేట్ చేస్తాం.. మహాభారతంలో ద్వారకా ఎక్కడుందో తెలుసుకున్నారు.. కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసిన మహాభారతం పుస్తకంలో ఉన్నట్టే ఆగోడలు ..పిల్లర్స్ ఎలా ఉన్నాయని మనవాళ్లే ప్రూఫ్ లతో తీసుకొచ్చారు. మన కల్చర్ ను ఎందుకు మనం నమ్మట్లేదు.. హిస్టరీ గురించి తెలుసుకోవడం ఓకే కానీ మన హిస్టరీని మనం నమ్మాలి..మిగతావాళ్లందరూ వాళ్ల చరిత్రలను నమ్ముతారు.. చాలా గర్వంగా ఫీలవుతారు.. కన్నప్ప అనే కథ రియల్ స్టోరీ అనడానికి నిదర్శనం శ్రీకాళహస్తీ టెంపుల్. ఆ గుడి వందల వేల సంవత్సరాల నుండి అక్కడ ఉంది.. వాయిలింగం, స్వయంబు లింగం అది.. ఆ లింగం గురించి మైథలాజికల్ మూవీ కాదు.. శివునికి అపార భక్తుడైన కన్నప్పనిజమైన కథ.. నేను కన్నప్ప ప్రపంచాన్ని మీకు పరిచయం చేయడానిక వెయిట్ చేయలేకపోతున్నా.. నేను మళ్లీ చెబుతున్నా చరిత్రను తెలుసుకోండి.. చరిత్రను సొంతం చేసుకోండి అంటూ తెలిపాడు.

కాగా ఈసినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పాటు నయనతార, మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, ప్రీతి ముకుందన్ నటిస్తున్నారు. ఇంకా పలువురు స్టార్లు ఈసినిమాలో నటించనున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాను అవా ఎంటర్టైన్మెంట్‌ ఇంకా 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మంచు విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్‌ బాబు నిర్మిస్తున్నారు. మణిశర్మ, స్టీఫెన్‌ దేవాసి సంయుక్తంగా ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.