ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న హిట్ ను సలార్.. సీజ్ ఫైర్ తో అందించాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ మాస్ యాక్షన్ తో అందరినీ ఫిదా చేశాడు. ఇక ఇప్పుడు పార్ట్2 కోసం కసరత్తులు జరుగుతున్నాయి. దీనితో పాటు ప్రభాస్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కల్కి 2898ఏడి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా ముగించుకుంటుంది. ఇప్పటివరకూ ఈసినిమా నుండి పలు వీడియోలను రిలీజ్ చేయగా అవి ఏరేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయో చూశాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను నేడు తెలియచేస్తామని ఇప్పటికే అప్ డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ముందు ఈ సంక్రాంతికి వద్దామనుకున్నారు కానీ అది కుదరలేదు. దీంతో వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇక తాజాగా ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. మే 9వ తేదీన ఈసినిమాను ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
The story that ended 6000 years ago.
𝐁𝐞𝐠𝐢𝐧𝐬 𝐌𝐚𝐲 𝟗𝐭𝐡, 𝟐𝟎𝟐𝟒.The future unfolds. #Kalki2898AD@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD #Kalki2898ADonMay9 pic.twitter.com/TRrL5pCTUZ
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) January 12, 2024
కాగా ఈసినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో మరొక హీరోయిన్ బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ కూడా నటిస్తుంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ మరో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తోట రమణి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























