సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న సినిమాల్లో పలు ఇట్రెస్టింగ్ సినిమాలు ఉండగా అందులో అందరూ ఆసక్తికరంగా ఎదురుచూసే సినిమా గంటూరుకారం. అతడు, ఖలేజా సినిమాల తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక మరో మూడు రోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక ఇప్పుడు ఈసినిమాకు సంబంధించి ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్ ఇచ్చారు మేకర్స్. తెలంగాణలో ఈసినిమా మిడ్ నైట్ షోస్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. 23 థియేటర్లలో 6 షోలకు అనుమతి లభించింది. 250 సింగిల్ స్కీన్స్, 410 మల్టీ ప్లెక్స్ ల్లో తెల్లవారు జామున 4 గంటల నుండి షోస్ మొదలవ్వనున్నాను.
ఈసినిమాలో మహేష్ బాబు సరసన మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్న ఈసినిమాకు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఈసినిమాను సంక్రాంతి కానుకగా 2024, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























