దేవర గ్లింప్స్ కు రికార్డు వ్యూస్  

Devara Glimpse clocks humongous 57Million plus views

ఎన్టీఆర్ దేవర గ్లింప్స్ రికార్డులను తిరగరాసింది.24గంటల్లో అన్ని భాషల్లోకి కలిపి 57మిలియన్లకు కుపైగా వ్యూస్ ను రాబట్టుకొని ఆల్ టైం రికార్డు ను సృష్టించింది.ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుంది.నిన్న సాయంత్రం ఈ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా ఎక్స్ట్రార్డినరీ  రెస్పాన్స్ వస్తుంది.79సెకండ్ల వీడియో లో దేవర ఊచకోత ను చూపెట్టారు. డైలాగ్స్ కి తోడు ఎన్టీఆర్ లుక్,అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అయ్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈగ్లింప్స్ తెలుగులో కొత్త రికార్డు సృష్టించింది.26.17మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టి 24గంటల్లో అత్యధిక వ్యూస్ ను రాబట్టిన గ్లింప్స్ గా రికార్డు సృష్టించింది.ఓవరాల్ గా చేస్తే 24గంటల్లో సింగిల్ ఛానెల్ లో అత్యధిక వ్యూస్ ను రాబట్టిన గ్లింప్స్ రికార్డు పుష్ప ది రూల్ పేరిట వుంది.పుష్ప 2 హిందీ వెర్షన్ 27.67 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది.ఈ జాబితాలో దేవర రెండో స్థానంలో వుంది.మొత్తానికి గ్లింప్స్ తో సినిమా వున్న హైప్ ను డబుల్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు.

దేవరను కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.తెలుగులో ఆమె కు ఇదే మొదటి సినిమా.సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.యువసుధ ఆర్ట్స్,ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.దేవర రెండు భాగాలుగా రానుందని తెలిసిందే.ఫస్ట్ పార్ట్ ఏప్రిల్ 5న విడుదలకానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.