అభిమానులకు చేతులు జోడించి అడుగుతున్నా.. దయచేసి ఇలాంటి పనులు చేయకండి అని విజ్ఞప్తి చేశారు శాండల్‌వుడ్ స్టార్ హీరో, ‘కేజీఎఫ్’ ఫేమ్ యశ్. సోమవారం (జనవరి 8, 2024) యశ్ జన్మదినం సందర్భంగా.. కర్ణాటకలోని గడగ్ జిల్లాలో కటౌట్స్ ఏర్పాటు చేస్తూ విద్యుదాఘాతానికి గురై ఆయన అభిమానులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ సంఘటన నేపథ్యంలో హీరో యశ్ మంగళవారం ప్రత్యేక విమానంలో ముందుగా హుబ్లీకి చేరుకొన్నారు. అక్కడినుంచి నేరుగా రోడ్డు మార్గంలో లక్ష్మేశ్వర్ తాలూకాలోని సురనాగి గ్రామం, అంబేద్కర్ నగర్‌లోని బాధితుల ఇళ్లను సందర్శించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా అభిమానుల కుటుంబాలను పరామర్శించిన ఆయన.. ఘటనపై తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇకపై వారి బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం హీరో యశ్ మీడియాతో మాట్లాడుతూ.. “అభిమానుల మరణ వార్త నన్ను చాలా బాధించింది. ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయనే.. నా పుట్టినరోజున బ్యానర్లు, కటౌట్లు పెట్టడం మానేయాలని ఎన్నోసార్లు కోరాను. అభిమానులకు నేను చెప్పేది ఒక్కటే ప్రమాదాలను కొని తెచ్చుకోకండి. ఇప్పటికైనా ఇలా ఫ్లెక్సీలు కట్టడం వంటి పనులు చేయడం మానేయండి” అని అభిమానులను కోరారు.
ఇంకా ఆయన ఇలా అన్నారు.. “నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా కొందరు బైకులపై వేగంగా నా కారును వెంబడించారు. దయచేసి అలా చేయకండి. ఏదైనా జరిగితే అందరం బాధపడాల్సి వస్తుంది. చనిపోయిన వారిని తిరిగి తీసుకురాలేం. ఇలా ప్రమాదాలు జరుగుతుండటంతో నాకు పుట్టినరోజు వస్తోందంటేనే భయమేస్తోంది. నాపై ప్రేమను చూపించాలంటే మీ భవిష్యత్తు కోసం ఏదైనా చేసుకోండి. మా గురించి ఆలోచించకండి, మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. జీవితంలో సంతోషంగా ఉండండి. నేను మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నా.. ఇలాంటి పనులు మరోసారి చేయకండి” అని హీరో యశ్ ఫ్యాన్స్‌కి విజ్ఞప్తి చేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























