హిట్ సినిమాలకు సీక్వెల్స్ రావడం అనేది కామన్ అయిపోయింది. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో హిట్ సినిమాకు సీక్వెల్ వస్తుంది. అంజలి ప్రధాన పాత్రలో వచ్చిన కామెడీ ప్లస్ హార్రర్ మూవీ ‘గీతాంజలి’ సినిమా ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ వస్తుంది. ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ అనే టైటిల్ తో ఈసీక్వెల్ రానుంది. శివ తుర్లపాటి దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా షూటింగ్ ను చాలా సైలెంట్ గా మొదలుపెట్టారు. అయితే షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్లు మాత్రం పెద్దగా ఇవ్వలేదు. రీసెంట్ గానే పలు పోస్టర్లు రిలీజ్ చేశారు. అంజలి పోస్టర్ ను అలానే ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్టు అధికారికంగా తెలియచేశారు.
Done filming, but the horror’s just begun 🎬💥#GeethanjaliMalliVachindhi Coming soon to spook your spirits and tickle your funny bone 😂🪆#Anjali50 @yoursanjali @MP_MvvOfficial @konavenkat99 #GV #ShivaTurlapati @Plakkaraju #SujathaSiddarth @Actorysr @Satyamrajesh2 pic.twitter.com/lq4QQxm4nV
— Kona Film Corporation (@KonaFilmCorp) January 8, 2024
కాగా ఈసినిమాలో ఇంకా మలయాళ నటుడు రాహుల్ మాధవ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్‌లతో పాటు ఈ సీక్వెల్‌లో సత్య, సునీల్, రవిశంకర్, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు రాహుల్. ప్రముఖ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పణలో ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ప్రతిష్టాత్మకంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























