సూపర్ స్టార్ మహేష్ బాబు ,స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా గుంటూరు కారం.ట్రైలర్ కూడా విడుదలకాకముందే అడ్వాన్స్ బుకింగ్స్ లో సెన్సేషన్ సృష్టిస్తుంది.యూఎస్ఏ లో బుకింగ్స్ ఓపెన్ కాగా ఇప్పటివరకు 450k డాలర్ల ప్రీ సేల్స్ జరిగాయి.సినిమా రిలీజ్ టైం కి వన్ మిలియన్ దాటనుంది.మహేష్ కు ఓవర్సీస్ లో సాలిడ్ మార్కెట్ వుంది. ఒకటి రెండు కాదు ఏకంగా 11సినిమాలు మిలియన్ మార్క్ ను క్రాస్ చేశాయి ఇక ఇప్పుడు వస్తున్న గుంటూరు కారం కూడా దుమ్మురేపుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా మరో రికార్డు కూడా సృష్టించింది.యూఎస్ఏ లో గుంటూరు కారంకు 5408కు పైగా ప్రీమియర్ షోస్ పడనున్నాయి.టాలీవుడ్ లో ఇప్పటివరకు ఇదే రికార్డు.ఇక అటు ఈసినిమా ట్రైలర్ ను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విడుదలచేయకుండా అంత కన్నా ముందే విడుదలచేసే ఆలోచనలో ఉందట టీం.ఈ సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశాలు వున్నాయి.
యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈసినిమాలో శ్రీ లీల ,మీనాక్షి చౌదరీ హీరోయిన్లు గా నటించగా తమన్ సంగీతం అందించాడు.హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించిన ఈసినిమా జనవరి 12 విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























