గుంటూరు కారం- కుర్చీ మడతపెట్టి మాస్ సాంగ్ రిలీజ్

kurchi madathapetti full song released from guntur kaaram movie

2024 పొంగల్ రేసులో ఉన్న సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ సినిమా మహేష్ నుండి వస్తున్న గుంటూరు కారం సినిమా ఒకటి. ఈ ఏడాది మహేష్ నుండి సినిమా మిస్ అయింది.. దీంతో అభిమానులు కూడా మహేష్ ను సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు చూద్దామా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక వారి ఎదురుచూపులకు మరికొద్దిరోజుల్లో బ్రేక్ పడనుంది. ఈసినిమా ఒకవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా నుండి ప్రస్తుతం పాటలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే దమ్ మసాలా అనే సాంగ్ అలానే ఓ మై బేబి అనే పాటలను రిలీజ్ చేశారు. వీటిలో దమ్ మసాలా సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఓ మై బేబి సాంగ్ కూడా బాగానే ఆకట్టుకుంటుంది. ఇక ఇప్పుడు కుర్చీ మడతపెట్టి అంటూ ఫుల్ మాస్ సాంగ్ తో మాస్ డ్యాన్స్ తో వచ్చేస్తున్నాడు. ఈపాట ప్రోమోను ఇప్పటికే రిలీజ్ చేయగా ప్రోమోతోనే పాటకు సూపర్ క్రేజ్ వచ్చేసింది. ఇక ఇప్పుడు ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈపాట సూపర్ బీట్ తో ఆకట్టుకుంటుంది. అంతేకాదు శ్రీలీల, మహేష్ బాబు ఈపాటలో అదిపోయే స్టెప్స్ ను వేశారు. థియేటర్ లో ఈపాటకు విజిల్స్ పడటం ఖాయమనిస్తుంది.

ఈసినిమాలో మహేష్ బాబు సరసన మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్న ఈసినిమాకు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఈసినిమాను సంక్రాంతి కానుకగా 2024, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.