హాయ్ నాన్న స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన నెట్ ఫ్లిక్స్ 

hi nanna ott streaming update

న్యాచురల్ స్టార్ నాని లేటెస్ట్ హిట్ హాయ్ నాన్న ఓటిటి రిలీజ్ డేట్ వచ్చేసింది.జనవరి 4న ఈసినిమా అందుబాటులోకి రానుందని నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది.తెలుగుతోపాటు కన్నడ ,మలయాళ,తమిళ ,హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.ఇక విడుదలైన నెల లోపే హాయ్ నాన్న ఓటిటి లోకి రానుండడం గమనార్హం. మాములు గా ప్లాప్ సినిమాలను నెలలోపు విడుదలవుచేస్తుంటారు కానీ ఇప్పుడు నాని లాంటి స్టార్ హీరో సినిమా అది కూడా హిట్ అయినా 5వారంలో వచ్చేస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికీ ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.వీకెండ్ లో కొన్ని థియేటర్లు హౌస్ ఫుల్ నడుస్తున్నాయి.ఇక కలెక్షన్ల విషయానికి వస్తే హాయ్ నాన్న ప్రపంచ వ్యాప్తంగా నిన్నటి వరకు 70కోట్ల గ్రాస్ ను రాబట్టుకుంది.మొదటి రోజు స్లో గా స్టార్ట్ చేసిన ఈసినిమా మౌత్ టాక్ వల్ల పుంజుకొని బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసింది.

లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈసినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ నటించగా  కియారా ఖన్నా నాని కూతురిగా నటించింది.ఈముగ్గురు నటనలో అదరగొట్టారు.హేషం అబ్దుల్ వాహబ్ సంగీతం కూడా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.వైరా ఎంటర్టైన్మెంట్స్ ఈసినిమాను నిర్మించింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.