500 కోట్ల క్లబ్ లో సలార్

prabhas salaar movie joins in 500 crore club

బాహుబలి సిరీస్ తో తన సత్తాను ప్రపంచానికిి తెలియచేశాడు ప్రభాస్. ఆసిరీస్ తో ప్రభాస్ రేంజ్ కూడా మారిపోయింది. ఇక బాహుబలి తరువాత ప్రభాస్ సాహో, ఆదిపురుష్ సినిమాలతో వచ్చాడు కానీ ఆ సినిమాలు అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయాయి. అయితే ఇప్పుడు సలార్ తో ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వచ్చింది. ఖాన్సార్ అనే సామ్రాజ్యపు కుర్చీ కోసం జరిగే పోరు నేపథ్యంలో ఈసినిమా కథ. రెండు పార్ట్ లుగా రానున్న ఈసినిమా మొదటి పార్ట్ సలార్-సీజ్ ఫైర్ తో ఈసినిమా వచ్చింది. ఈసినిమాకు ప్రభాస్ కటౌటే ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా ఎక్కడా తగ్గట్లేదు. ఫస్ట్ డే నుండీ కూడా అదే జోరు కొనసాగిస్తుంది. మొదటిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.178.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. ఇక రెండో రోజు దాదాపు 300 కోట్లు కోట్ల వరకు చేసుకున్న సలార్.. మూడో రోజు 400 కోట్ల మార్క్ ని దాటేసింది. ఇక తాజాగా ఈ చిత్రం 500 కోట్ల మార్క్ ని దాటింది. ఇక ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది. ఆరు రోజుల్లో ఈ చిత్రం 500 కోట్ల గ్రాస్ ని క్రాస్ చేసినట్టు పోస్టర్ ద్వారా తెలియచేశారు. మరి త్వరలోనే ఈసినిమా 1000 కోట్ల క్లబ్ లో చేరిపోతుంది అని అంటున్నారు సినీ విశ్లేషకులు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.