ఈ నెలలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ప్రభాస్ సలార్ సినిమా కూడా ఒకటి. ఈసినిమా కోసం కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ లవర్స్ అందరూ ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పైనల్లీ ఈసినిమా డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ కాబోతుంది. రెండు భాగాలుగా వస్తున్న ఈసినిమాలో మొదటి భాగంగా సలార్..సీజ్ ఫైర్ అనే టైటిల్ తో భాగం రాబోతుంది. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్, ట్రైలర్ లను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే ఈసినిమా ఆడియో రైట్స్ ను హౌంబలే మ్యూజిక్ వారే సొంతం చేసుకున్నట్టు తెలిపారు. తాజాగా ఈసినిమా ఫస్ట్ సింగిల్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. సూరీడే అంటూ వచ్చే ఈసినిమా ఫస్ట్ సింగిల్ ను రేపు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు మేకర్స్. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో ఈపాటను రిలీజ్ చేయనున్నారు.
First Single from #SalaarCeaseFire out tomorrow 🎵#SalaarFirstSingle: #Sooreede (Telugu), #SoorajHiChhaonBanke (Hindi), #AakaashaGadiya (Kannada), #Suryangam (Malayalam), #AagaasaSooriyan (Tamil).
Music by @RaviBasrur 🎶#Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial… pic.twitter.com/0iYnnrTZs8
— Salaar (@SalaarTheSaga) December 12, 2023
కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























