టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలయికలో వస్తోన్న తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొన్నిరోజుల క్రితం విడుదలైన సంజయ్ దత్ ఫస్ట్ లుక్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక సాలిడ్ అప్డేట్ వచ్చింది. ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్ర బృందంలోకి మరో లెజెండరీ టెక్నీషియన్ చేరారు. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్, మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ పూరి కనెక్ట్స్ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. కాగా ఇంతకుముందు పూరి జగన్నాథ్ మరియు మణి శర్మల కాంబినేషన్లో వచ్చిన బాక్సాఫీస్ హిట్ మూవీలు ‘పోకిరి’, ‘చిరుత’, ‘ఇస్మార్ట్ శంకర్’ మ్యూజికల్‌గా బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఈ కాంబో ‘డబుల్ ఇస్మార్ట్’ కోసం కలిసి పనిచేయనుండటంతో చార్ట్‌బస్టర్ ఆల్బమ్ పక్కా అని అభిమానులు భవిస్తున్నారు.
The blockbuster combo is back 😎
Team #DoubleISMART proudly welcomes the musical maestro #ManiSharma on board for another sensational film and a chartbuster album 💥
IN CINEMAS MARCH 8th,2024 ❤️🔥
Ustaad @ramsayz #PuriJagannadh @duttsanjay @Charmmeofficial @IamVishuReddy pic.twitter.com/w9akGHxPGK
— Puri Connects (@PuriConnects) November 24, 2023
ఇక పూరి జగన్నాథ్ దీనికిముందు విజయ్ దేవరకొండతో తీసిన ‘లైగర్’ డిజాస్టర్ కావడంతో ఎలాగైనా ‘డబుల్ ఇస్మార్ట్’తో హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. అలాగే రామ్ పోతినేని కూడా ‘స్కంద’ సినిమా మిగిల్చిన చేదు అనుభవాన్ని ఈ మూవీ సక్సెస్ ద్వారా అధిగమించాలని చూస్తున్నాడు. ఈ చిత్రం కోసం రామ్ స్పెషల్ మేకోవర్ అయ్యారు. ఇక తన నటీనటులను బెస్ట్ మాస్ అప్పీలింగ్లో ప్రజంట్ చేయడంలో స్పెషలిస్ట్ అయిన పూరి జగన్నాథ్ ‘డబుల్ ఇస్మార్ట్’లో.. సంజయ్ దత్‌ను మునుపెన్నడూ చూడని అవతారంలో చూపించనున్నారు. అలాగే రామ్ మరియు సంజయ్ దత్‌లను తెరపై కలిసి చూడటం అభిమానులకు, సినీ ప్రియులకు ఎక్సయిటింగ్‌గా ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ వైల్డ్ కాంబినేషన్ ‘డబుల్ ఇస్మార్ట్’పై అంచనాలను పెంచేసింది.
కాగా ఈ క్రేజీ ఇండియన్ ప్రాజెక్ట్‌ను పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై డైరెక్టర్ పూరి జగన్నాథ్, నటి-నిర్మాత ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ క్రేజీ ఎంటర్టైనర్ కోసం హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ జియాని జియానెల్లి పనిచేస్తుండటం గమనార్హం. అలాగే హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ కేచ నేతృత్వంలో హై-వోల్టేజ్ యాక్షన్ సీన్స్ కంపోజ్ చేస్తున్నారు. సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో హై బడ్జెట్‌తో రూపొందుతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాను వచ్చే ఏడాది మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























