న్యాచురల్ స్టార్ నాని మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం శౌర్యువ్ దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న సినిమా హాయ్ నాన్న. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా ఈసినిమా రాబోతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. నాని కూతురిగా బేబి కైరా ఖన్నా నటిస్తోంది. వైరా ఎంటర్‌టైన్మెంట్స్ పై నిర్మిస్తున్న ఈసినిమాకు సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫి.. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Welcome aboard, @priyankaamohan! ❤️
Can’t wait to see you on the set soon! 🤗#Nani31
Natural🌟 @NameIsNani #VivekAthreya @DVVMovies pic.twitter.com/BYly81zZ3g
— DVV Entertainment (@DVVMovies) October 21, 2023
ఇక ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టేశాడు నాని. దీనికి సంబంధించిన అప్ డేట్ తాజాగా వచ్చింది. డీవీవీ బ్యానర్ పై నాని 31వ సినిమా రాబోతుంది. వివేక్ ఆత్రేయ ఈసినిమాకు దర్శకత్వంలో వహించనున్నాడు. ఇక ఇప్పుడు తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాలో నటించే హీరోయిన్ అప్ డేట్ తో వచ్చారు. ప్రియాంక మోహన్ ఈసినిమాలో నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. కాగా వీరిద్దరూ కలిసి గ్యాంగ్ లీడర్ సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































