1 మిలియన్ ప్రీ సేల్స్ తో లియో రాంపేజ్

leo movie usa pre sales update

రీసెంట్ గానే వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకువచ్చిన విజయ్ ఆసినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా వస్తున్న సినిమా లియో. ఈసినిమా రిలీజ్ కు ముందే సూపర్ బజ్ ను క్రియేట్ చేసుకుంది. తెలుగులో ఈసినిమా ప్రమోషన్స్ సరిగ్గా లేకపోయినా విజయ్ కు ఉన్న క్రేజ్ వల్ల సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక అందరి ఎదురుచూపులకు మరో రెండు రోజుల్లో బ్రేక్ పడనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇక్కడ మాత్రమే కాదు విదేశాల్లో కూడా విజయ్ కు ఎంత పాలోయింగ్ ఉందో మరోసారి రుజువైంది. ఈసినిమా చూడటానికి అక్కడ ఫ్యాన్స్ కూడా ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో ఈసినిమాకు వస్తున్న ప్రీ సెల్స్ ను బట్టి చెప్పొచ్చు. ఈసినిమా యూఎస్ఏ హక్కులను ప్రముఖ సంస్థ ప్రత్యంగిర బ్యానర్ వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసింద కదా. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా యూఎస్ ప్రీ సెల్స్ గురించి తెలియచేశారు. ఈసినిమా ప్రీసేల్స్ 1 మిలియన్ వరకూ చేరింది.. ఈవిషయాన్ని పోస్టర్ రిలీజ్ చేస్తూ తెలిపారు. మరి యూఎస్ లోనే కాదు యూకే లో కూడా ఈసినిమా ప్రీ సేల్స్ కూడా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.

ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో సంజయ్ దత్, మిస్కిన్, గౌతమ్ మీనన్, అర్జున్ సర్జ, ప్రియా ఆనంద్, ఇంకా మాథ్యూ థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా జగదీష్ పళనిసామి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంస పనిచేస్తున్నారు. సతీశ్ కుమార్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌ గా.. అన్బరివ్‌ యాక్షన్‌ కొరియోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.