బిగ్ బాస్ 7-హీటెక్కించిన 7 వారం నామినేషన్స్

bigg boss season 7 telugu 7th week nominations

బిగ్ బాస్ సీజన్ 7 లో చూస్తుండగానే ఆరు వారాలు పూర్తయిపోయింది. ఏడో వారం కూడా మొదలైపోయింది. ఇక కొత్తగా ఐదుగురు కంటెస్టెంట్ లు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా వారిలో నయని పావని ఒక్క వారానికే ఎలిమినేట్ అయిపోయింది. నయని పావని ఎలిమినేషన్ కాస్త షాక్ అయ్యారు కంటెస్టెంట్స్. దీంతో ఆదివారం ఎపిసోడ్ పూర్తయిపోయి సోమవారం ఎపిసోడ్ పూర్తవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా గత వారం గేమ్స్ లో భాగంగా శివాజీ భుజానికి గాయమైన సంగతి తెలిసిందే కదా. అయితే గాయం ఇంకా నయం కాకపోవడంతో బయటకు వెళ్లి మళ్లీ ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే శివాజీ మళ్లీ అక్కడ కాస్త కన్ఫ్యూజ్ చేశాడు. ఇక అందరూ ఎదురుచూస్తున్న నామినేషన్ ప్రిక్రియ వచ్చేసింది. ఈసారి ఒక్కో కంటెస్టెంట్ ఇద్దరినీ నామినేట్ చేస్తూ వారి ఎదురుగా కుండలను పగలకొట్టాలి.

ముందుగా ప్రశాంత్ వచ్చి సందీప్ ను తేజను నామినేట్ చేస్తాడు. సందీప్ ను నామినేట్ చేస్తూ పిన్ గుచ్చినప్పుడు నువ్వు చెప్పిన రీజన్ నాకు నచ్చలేదు.. నేను కెప్టెన్ గా ఉన్నప్పుడు ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు నువ్వు మధ్యలో వచ్చి ఇంకొంచ పెంచావు అంటూ రీజన్ చెప్పాడు. తేజకు కెప్టెన్ ఏదైనా పనిష్మెంట్ ఇచ్చినప్పుడు తీసుకోవాలి అంటూ చెప్పాడు. ఆ తరువాత అమర్ దీప్ వచ్చి భోలే షావళి, అశ్విని ని నామినేట్ చేస్తాడు. భోలే కు కొన్ని మాట్లాడేప్పుడు కంఫర్ట్ లెవల్స్ ఉండవు.. ఏం మాట్లాడతారో మీకే తెలియదు అంటూ రీజన్ చెప్పగా.. అశ్వినిని ఐదు వారాలు ఉన్నారు కదా ఇంక చాలు అన్నారు అంటూ నామినేట్ చేశాడు. పూజా ఫస్ట్ భోలే, అశ్వినిని నామినేట్ చేస్తూ భోలే కి గేమ్ లో సీరియస్ గా ఉన్నప్పుడు హే పర్లేదు అంటూ సరదాగానే అన్నాను అంటూ చెబుతున్నారు.. గేమ్ లేనప్పుడు ఓకే.. గేమ్ లో ఉన్నప్పుడు సీరియస్ గా ఉంటే మంచింది అంటూ రీజన్ చెప్పింది. ప్రతిసారి నన్ను అందరూ దూరం పెడుతున్నారు అంటున్నావు అంటూ చెప్పింది.

అనంతరం సందీప్ వచ్చి భోలే ను ప్రశాంత్ ను నామినేట్ చేస్తాడు.. టాస్కుల్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్న అంటూ తెలిపాడు. ప్రశాంత్ ను చేస్తూ నేను ప్రమాణ పూర్తిగా చెబుతున్నా నీ గురించి బ్యాడ్ గా నేను ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు అంటూ రీజన్ ఇచ్చాడు. అర్జున్ భోలే, అశ్వినిని అలానే ప్రియాంక అశ్విని, భోలే ని.. తేజ పూజా, ప్రశాంత్ ను నామినేట్ చేస్తారు. తేజ నామినేషన్స్ తో సోమవారం ఎపిసోడ్ పూర్తవుతుంది. మిగిలిన కంటెస్టెంట్స్ ఇంకా నామినేట్ చేయాల్సి ఉంది. మరి ఈవారం ఎవరు నామినేషన్స్ లోకి వస్తారు అన్నది చూడాలంటే నేటి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.