ప్రస్తుతం రిలీజ్ కు సిద్దంగా ఉన్న మోస్ట్ వాంటెడ్ సినిమాల్లో లియో ఒకటి. తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా లియో. మాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈసినిమా అక్టోబర్ 19వ తేదీన రిలీజ్ చేయనుండగా తెలుగులో సితార ఎంటర్ టైన్ మెంట్స్ వారు రిలీజ్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా నుండి వరుసగా పాటలను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే రెండు పాటలను రిలీజ్ చేశారు. ఇప్పుడు మూడో పాటను రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన అప్ డేట్ ను తాజాగా అందించారు మేకర్స్. అన్బేనమ్ అంటూ వచ్చే మూడో పాటను రేపు అంటే అక్టోబర్ 11వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.
#Anbenum – #LeoThirdSingle is releasing tomorrow #Thalapathy @actorvijay na @trishtrashers @Dir_Lokesh @anirudhofficial @SonyMusicSouth #Leo pic.twitter.com/qpA7JX6cuQ
— Jagadish (@Jagadishbliss) October 10, 2023
ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో సంజయ్ దత్, మిస్కిన్, గౌతమ్ మీనన్, అర్జున్ సర్జ, ప్రియా ఆనంద్, ఇంకా మాథ్యూ థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా జగదీష్ పళనిసామి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంస పనిచేస్తున్నారు. సతీశ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా.. అన్బరివ్ యాక్షన్ కొరియోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























