సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమా భగవంత్ కేసరి. ఇప్పటివరకూ అనిల్ రావిపూడి కాస్త కామెడీ యాంగిల్ లోనే సినిమాలు తీసి సక్సెస్ లు అందుకున్నాడు. మొదటిసారి బాలకృష్ణతో యాక్షన్ సినిమాతో వస్తుండటంతో ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలు ఉన్నాయి. ఈసినిమా దసరా పండుగ సందర్బంగా అక్టోబర్ 19వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనిలో భాగంగానే ఈసినిమా ట్రైలర్ ను నిన్న రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా నువ్వు ఏడున్నా గిట్ల దమ్ముతో నిలబడాలి…అప్పుడే దునియా నీ బాంచన్ అంటది అంటూ తెలంగాణ స్లాంగ్‌లో బాలకృష్ణ చెప్పిన డైలాగ్స్ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలుస్తోన్నాయి. శ్రీలీల కు ఆర్మీ ట్రైనింగ్ ఇచ్చే సన్నివేశాలు కాస్త కామెడీగా ఉన్నాయి. ఇంకా చివరిలో నేలకొండ భగవంత్ కేసరి అంటూ బాలకృష్ణ ఎంట్రీ గురించి కాజల్, శ్రీలీల కలిసి చెప్పడం, ట్రైలర్ చివరలో బాలకృష్ణ ఖైదీ గెటప్‌లో కనిపించడం బాగుంది. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతూ సినిమాపై క్రేజ్ ను మరింత పెంచేసింది. మరి ఈసినిమా ట్రైలర్ లో మీకు నచ్చిన ఎలిమెంట్స్ ఏంటో మీ ఓటు ద్వారా తెలియచేయండి.
[totalpoll id=”104249″]
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































