ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి (వైఎస్సార్) పాదయాత్ర నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘యాత్ర’. మహీ వి. రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019 ఫిబ్రవరి 8న విడుదలై మంచి విజయం అందుకుంది. వైఎస్సార్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు. వైఎస్సార్ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశారని చెప్పవచ్చు.. నడకలో, బాడీ లాంగ్వేజ్‌లో, హావభావాల్లో వైఎస్సార్‌ను దించేశారు మమ్ముట్టి. ఇక వైఎస్సార్ తండ్రి రాజారెడ్డి పాత్రలో సీనియర్ నటుడు జగపతి బాబు, వైఎస్సార్‌కు అత్యంత సన్నిహితుడు కేవీపీ రామచంద్ర రావుగా రావు రమేష్ నటించారు. అలాగే సీనియర్ నాయకురాలు గౌరు చరిత క్యారెక్టర్లో నటి అనసూయ కీలక పాత్రలో కనిపించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘యాత్ర 2’ రాబోతోంది. దీనిలో ప్రధానంగా వైఎస్సార్ తనయుడు, ప్రస్తుత ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన అంశాలను చూపించనున్నారు. వైయస్ జగన్ రాజకీయ రంగప్రవేశం, అందుకు దారి తీసిన పరిస్థితులు, సొంతంగా వైఎస్సార్సీపీ పార్టీని స్థాపించడం, ప్రతిపక్షనాయకుడిగా ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి పాదయాత్ర చేపట్టడం.. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రి పదవిని అందుకోవడం వంటివాటిని విపులంగా వివరించనున్నారు. ఇక ఇందులో వైయస్ జగన్ పాత్రను ప్రముఖ తమిళ నటుడు జీవా పోషిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే మమ్ముట్టి తన పాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొన్నారు.
తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక కీలక అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘యాత్ర 2’ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలిపారు. అక్టోబర్ 9వ తేదీ ఉదయం 11 గంటలకు యాత్ర 2 ఫస్ట్ లుక్‌ని ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా.. “తండ్రి నుండి కొడుకు వరకు.. వాగ్దానం నుండి వారసత్వం వరకు! మునుపెన్నడూ లేని అసాధారణ ప్రయాణానికి సాక్షి!” అంటూ అందులో పేర్కొన్నారు. ఇక ఇదిలా ఉంటే.. ‘యాత్ర 2’ సినిమా రిలీజ్ విషయంలో ఒక వార్త వైరల్ అవుతోంది. ఈ చిత్రం కూడా తొలిభాగం విడుదలైన రోజునే రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంటే.. 2024 ఫిబ్రవరి 8న విడుదలవుతుందన్నమాట. అయితే దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
From father to son, from promise to legacy!
Unveiling first look of #Yatra2 on 9th Oct at 11 am.
Witness an extraordinary journey like never before!#Yatra2FL #LegacyLivesOn pic.twitter.com/ScsYUjHZce
— BA Raju’s Team (@baraju_SuperHit) October 7, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























