వరుణ్-లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్

varun tej and lavanya tripathi pre wedding celebrations

ఎన్నో ఏళ్లు ప్రేమాయణం తరువాత టాలీవుడ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహ బంధం ద్వారా ఒకటవుతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే వీరిద్దరి ఎంగేజ్ మెంట్ కూడా అయిపోయింది. జూన్ 9వ తేదీన ఎంగేజ్ మెంట్ జరుగగా అందరూ ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తుంది వీరి పెళ్లి డేట్ కోసం. అయితే డెస్టీనేషన్ వెడ్డింగ్ ను ప్లాన్ చేయగా..వచ్చే నెల వీరి వివాహం జరగనున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే తాజాగా చిరు సర్ ప్రైజింగ్ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. వరుణ్-లావణ్య త్రిపాఠి ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలైనట్టు తెలిపారు. అంతేకాదు దీనికి సంబంధించిన ఫొటోలను కూడా పోస్ట్ చేశారు. ఇక ఫొటోలను బట్టి మెగా పరివారం మొత్తం ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నట్టు అర్థమవుతుంది. చిరంజీవి, సురేఖ దంపతులతో పాటు, రామ్ చరణ్, ఉపాసన, నాగ‌బాబు ఫ్యామీలి, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, లావణ్య ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ సభ్యులంతా పాల్గొన్నారు. అంతేకాదు వరుణ్-లావణ్య కూడా చాలా కలర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. ఈఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 14 =